మాదకద్రవ్యాలు,నేరాలపై సమాజం ఐక్యంగా పోరాడాలి - పోప్
జోసెఫ్ అవినాష్
15 May 2026
మాదకద్రవ్యాలు,అక్రమ నేర ముఠాలు,హింస ఇవి కేవలం చట్ట సమస్యలు మాత్రమే కాకుండా మానవ జీవితాన్ని,కుటుంబాలను, సమాజ భవిష్యత్తును దెబ్బతీసే ప్రమాదకరమైన శక్తులని రోమ్ వేదికగా నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో విశ్వ కాపరి పోప్ లియో XIV ఈ వ్యాఖ్యలు చేశారు.నేరాలను అరికట్టడం ఎంత ముఖ్యమో,తప్పిపోయిన వారిని తిరిగి మంచి మార్గంలో నడిపించడం కూడా అంతే ముఖ్యమని ఆయన గుర్తుచేశారు.శిక్షలో కూడా మానవ గౌరవం కాపాడబడాలని,బాధితులకు న్యాయం జరగడంతో పాటు యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా కుటుంబాలు,విద్యాసంస్థలు,సమాజం కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
