మన రక్షకుడు క్రీస్తు

బ్రదర్ టోనీ నాగిపోగు MSC
14 May 2026
పాస్క ఆరవ శుక్రవారము, (YEAR -A)
మొదటి పఠనము : అపో :18: 9-18
సువిశేష పఠనము : యోహాను 16:20-23
(అపో 18: 9-10)......నీవు బయపడవలదు. నీవు ఇంకను దేవుని వాక్కును బోధించుచునే ఉండుము. ఆ పనిని ఆపకుము).
కొరింతు ఒక పెద్ద వాణిజ్య నగరము. అక్కడ అనేక జాతులవారు నివసిస్తువుండేవారు. విగ్రహారాధన, అనైతిక జీవితం ఎక్కువ, దేవుణ్ణి ఆయన వాక్యాన్ని ప్రకటించటం సులభమైన పనికాదు ప్రియులారా..... ఇటువంటి తరుణములో పౌలు గారు వ్యతిరేకతలు, మరియు భయాలమధ్య ప్రకటిస్తున్నాడు. క్రీస్తు దర్శనం ఆయనకు ఆత్మీయ దైర్యమును ఇచ్చింది. ఆత్మీయ బలాన్ని చేకూర్చబెట్టింది. అక్కడ ఆయన ఒక సంవత్సరము ఆరు నెలలు వాక్యాన్ని బోదించాడు. ఈ సువార్త పరిచర్య ద్వారారక్షణ కలిపిస్తునట్టు మనకు తెలుస్తుంది.
(యోహాను 16:22....మీరు సంతోషింతురు. మీ సంతోషమును మీ నుండి ఎవడును తీసివేయడు).
క్రైస్తవ జీవితములో కష్టాలు ఎదురుగాలులవలే, కన్నీరు రోజువారి వేతనం వలె, బాధలు ఏరికో గోడలు వలె, మన ముందు ఉంటాయి. నీ దుఃఖం ఎల్లకాలము నీతో ప్రయాణం చేయదు, నీ నిరాష జీవితం, నీతో ఎల్లకాలము స్నేహం చేయదు, పగిలిపోయిన నీ హృదయ జ్యోతి ఎల్లకాలము చీకటిని ప్రసాధించదు.క్రైస్తవ్యాన్నిమనము భారముగా స్వీకరించకూడదు. భుజాల బరువుగా మోయకూడదు, ఎందుకు అంటే నీవు నమ్ముకున్న ఆయన నీకు సంతోషమును పట్టనంతంగా ఇచ్చును. ఎవరు కూడా ఊహించని విధముగా అనుగ్రహింతును.
పౌలు కష్టమయినా, కఠినమయినా నగరములో సువార్త చేసాడు. సువార్త స్వీకరించని వ్యతిరేకుల మధ్య బోధించటం అంటే ఆశా మాషా కాదు, సమాజం మొత్తం వ్యతిరేకం, పౌలు గారిని కొట్టాలనే తత్వం, ఆయనను గెంటివేయాలానే మనస్తత్వం, ఆయన ప్రాణాలను తీసుకోవాలనే కక్ష, ఆయనను ఎలాగయినా అక్కడి నుండి తొలగించాలనే ఆ బుద్ధి, ఆ ప్రజలలో ఎక్కువ అయ్యిపోయింది. పెద్దలు యేమి చేయలేక పోయారు. పౌలు గారికి శిక్ష పడాలని అందరిముందు అనరాని మాటలు అన్నారు. అందరి ముందు నిందించారు. కానీ ఆయనలో వున్న ఆ ఆశ తగ్గిపోలేదు, దూషించని విధముగా దూషించారు. ఇవ్వన్నీ జరుగుతున్న ఆయనలో ఏమాత్రం ఆత్మీయ దాహం, ప్రకటించాలనే ఆ ఆత్మీయ శ్రద్ధ, ఏమాత్రము తగ్గలేదు. ప్రభువుల దర్శనము పొందాడు వెళలేని నిండైనా ధైర్యాన్ని పొందాడు. ముందటి వాటికన్నా మక్కువగా సువార్తను ప్రకటించటం మొదలుపెట్టాడు. అన్ని సమస్యల మధ్య ఇరుక్కుపోయిన... నీవు బయపడకుము అనిన ఆ మాటలు ఆయనకు కొండత ధైర్యాన్ని ఇచ్చాయి. ఆ పలుకులు ఆత్మీయ ఆనందమును ఇచ్చాయి. ఆ ఆనందం మరియు సంతోషం వర్ణించలేము. మరి ఆ ఆత్మీయ పలుకులు మనకు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి అని ఆత్మ పరిశీలన గావించుకోవాలి..
నిజమయిన ఆనందం క్రీస్తులోనే, శాశ్వతమైన సంతోషం క్రీస్తులోనే, మనము చేసే ప్రార్తనలో విశ్వాస ఆనందం ఉండాలి, మన ప్రార్థన గడియలు ఆత్మీయత కురిపించాలి. మన రోజువారిదినచర్యలో క్రీస్తు మహిమ వెధజల్లభడాలి. మన కన్నీరుని చూసి ఆయన గంతులు వేసే వారు కాదు, నీవు బాధపడకూడదు అని – ఆబాధను తను అనుభవించటం నీవు మరిచావ, నీకు రక్షణ కలిగించుటకు – తను రక్తాన్ని చిందించటం నీవు మరిచావ, నిన్ను ఆనందనావికలో ప్రయానింప చేయుటకు – కఠోర వేదనను పొందిన ఆ గడియ కఠోరమును నీవు మరిచావ, నీ కుటుంబ శ్రేయస్సు కొరకై – ఆయన శ్రమలలో నిండుగా అర్పింపబడటం- నీవు మరిచావా, నీ, నా, మన బలహీన క్రియల ద్వారా మనము నాశనం కాకూడదు అని, మన శాశ్వత రక్షణ కై ఆయన సిలువలో ప్రాణాలర్పించటం నీవు మరిచావ, ఇవన్నీ చేసిన చేస్తున్న ఆయన నీవు, నేను, మనము, దుఃఖముతో, నరకముతో, బాధతో ఉంటే ఆనందిస్తాడని ఎలా అనుకుంటున్నావు..... ఆయన ప్రేమ ఎంతో గొప్పది, ఆయన కరుణ ఎంతో గొప్పది, మంచితనం, ఎంతో గొప్పది, ఆయన సమక్షములోనే మనకు ఆనందము మహానందము. ఆయన నీడలో మనకు నిత్య ఆహ్లాధమే మహాహ్లాదమే...........
కన్నీరు – కనిపించదు, బాధ – మొలకెత్తదు, నష్టం – చిగురించదు, ఆవేదన – ఆవర్భించదు, నింద – మురిపించదు, అపహేళన- దొరకదు, దుష్టార్చన – మిగలదు, కుట్ర – పనిచేయదు, పగ – నిన్ను ముట్టదు, హింస – నిన్ను తలంచలేదు.......... ఎందుకంటే మన రక్షకుడు క్రీస్తు కాబట్టి, ఆయన మనతోనే శాశ్వతముగా మనకొరకు ఉంటాడు కాబట్టి, నీ, నా, మన, చేయి విడువడు, మరియు వదలడు కాబట్టి...... కావున మనము ఆయనలో, ఆయన ఆత్మీయ సహవాసములో నిండయినా ఆశీర్వాధాలను నిండైనా అనుగ్రమును ఎల్లవేళలా పొందుదాము.
దేవుడు మనలను దీవించును గాక...
