మణిపూర్ లో పాస్టర్ల హత్యలను ఖండించిన భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య

జోసెఫ్ అవినాష్
14 May 2026
2026 మే 13వ తేదీ,బుధవారం మణిపూర్లో ప్రార్థన సమావేశాలు ముగించుకొని వస్తున్న ముగ్గురు బాప్టిస్ట్ సంఘ పాస్టర్లపై కాంగ్‌పోక్‌పి జిల్లాలో గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు.ఈ ఘటనలో ముగ్గురు పాస్టర్లు అక్కడికక్కడే మరణించగా,మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనపై అఖిల భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య తీవ్రంగా స్పందిస్తూ, నిరపరాధుల ప్రాణాలు తీసే హింస ఏ సమస్యకూ పరిష్కారం కాదని స్పష్టం చేసింది.బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలియజేస్తూ,ప్రతీకారం కాదు.క్షమ, సంభాషణ, ఐక్యత, శాంతియుత సహజీవనం ద్వారానే సమాజానికి నిజమైన స్వస్థత లభిస్తుందని పీఠాధిపతులు పిలుపునిచ్చారు.అలాగే అక్కడ శాంతి,న్యాయం తిరిగి నెలకొనాలని ప్రార్థించారు.
