క్రీస్తే నిజ మృత్యుంజయిడు అని బలముగా ప్రకటిద్దాం

బ్రదర్ టోనీ నాగిపోగు MSC

13 May 2026

పాస్క ఆరవ గురువారము
మొదటి పఠనము : అపో : 1:15-17, 20-26
సువిశేష పఠనము : యోహాను :15:9-17


ప్రియులారా దేవునిపై నమ్మకమును నిలకడగా ఉంచుకున్న వారికి, ఆయనను అంటిపెట్టుకుని వున్నవారికి, తమ జీవితాలను ఆయనతో ముడివేసుకున్నవారికి, ఆయనను వదలని, ఆయనకై జీవించే విశ్వాసులను ఆయన పవిత్రమైన సేవలో బలముగా వాడుకొనుటకు పిలుచుకుంటాడు అని రోజుటి పునీత మత్తియాసు గారి మహోత్సవ పండుగతో మనకు అర్తం అవుతుంది. దేవుని కార్యములో కాళీలు వుండవు. ఆయన సేవా ముందుకు వెళ్తూనే ఉంటుంది. యూదా ఇస్కోరియొతు ద్రోహముతో మరణాన్ని చవిచూస్తే, మత్తియాసు గారు నిలకడ విశ్వాసముతో ఎన్నుకొనబడ్డాడు. దేవుని చిత్తనుసారము ఎన్నిక, దేవుని ప్రణాళిక ప్రకారం సేవలో కి ఆహ్వానం.


యూదా ఇస్కారియోతు :- ధన వ్యామోహతో పరిచర్యలో అడుగులు వేసాడు.
సత్యవంతునితో వున్నాడే గాని, సత్యాన్ని నేర్చుకోలేకపోయాడు.
నీతిమంతునితో కలిసాడేగాని కానీ నీతిగా జీవించలేకపోయాడు.
ఎందరో మార్చబడారు, స్వస్థతలు పొందారు, నూతనముగా మరల్చబడారు, కానీ యూదా మాత్రం పాత రోత మహా మోత అని జీవితాన్ని కొనసాగించాడు.
అందరినోట మెసేయ మాట, యూదా నోట ధన రాసుల మోత.
నిలకడ లేని విశ్వాసం
మోసపూరితమయిన భక్తి
మార్పులేని విధానం
లొకిష్టి మరియు ధనం అంటే చెప్పలేనంత మామకారము
అర్తం చేసుకోలేని మనస్తత్వం
దైవం వద్దు, ధనం ముద్దని నిర్ణయించుకున్నాడు
లోకమే సౌఖ్యం, లోకమే మధురం అని జీవించాడు
పాపములో వున్నాడు, ఆపాపంతో స్నేహం చేసాడు, ఆ పాపం శాపమై జీవితమును ముగించింది.


పునీత మత్తియాసు :- సేవ చేయాలనే ఆశ అమిత మయినది ఆయనలో.
విశ్వాసమును విస్తరణ చేయాలనే ఆ కసి ఆయనలో కనపడేవి
నిలకడ, దృఢత్వం, బలమయినా విశ్వాసం, వర్ణించలేనిది.
లోకముపై శ్రద్ధలేని భక్తుడు.
దైవాన్ని ద్రవ్యముతో పోల్చని వాడు.
లోక జాబ్స్ కన్నా దైవ జాబ్ మిన్న అని కంకణం కట్టుకున్నాడు.
తాను మరణించేంత, మృత్యుంజయుడు అయినా క్రీస్తును ప్రకటించాలని, పిడికిలి బిగించాడు.
శిష్యులను అర్తం చేసుకోగలిగాడు.
చీట్ల ద్వారా ఎన్నోకబడ్డాడు.
సేవలో ఉంటే ప్రమాదమని తెలిసిన, yes నేను సిద్ధం అని పలికిన సంసిద్ధం. భయములేని వ్యక్తి, క్రీస్తు బాటలో మాటలు వేసిన విశ్వాసుడు.
ఆయన ప్రేమ ప్రకటింపబడాలి.
దైవరాజ్య విస్తరణకు క్రొత్త జీవితమును ప్రారంభింంచిన నిలకడగల పూనీతుడు పునీత మత్తియాసు గారు.


ప్రియులారా మనము ప్రేమకు ప్రతిరూపముగా మారాలని మన క్రీస్తువారు నొక్కివొక్కాస్తున్నారు.
A) ప్రేమలో నిలచి వుండండి :- ( యోహాను 15:8....మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండుడు). ప్రేమతో జీవించాలని 0, ప్రేమకై ప్రాణాలను అర్పించాలని, నిజప్రేమ క్రీస్తు ప్రేమ, ఆప్రేమను ఇతరులపై అయనవలే చూపించాలని, ప్రతి విశ్వాసి మరో క్రీస్తుల జీవించాలని అయన మనతో మాట్లాడుతున్నారు
B) ఆనందబరితమయిన జీవితం :- నియమాలు జీవితం కాదు, నిజమయిన ఆనందమునకు మార్గం ఈ ప్రేమ, ఈ ప్రేమ వలనే నీవు నేను మనము రక్షింప పడ్డాము. మరి ఆప్రేమను ప్రకటిస్తున్నావా, ప్రేమ ప్రకారం పయనిస్తున్నావా ఆత్మపరిశీలన గావించుకో
C) గొప్ప ఆజ్ఞ (ప్రేమ ):- క్రైస్తవ జీవితం యొక్క కేంద్రము ప్రేమ. ఆప్రేమ మాటలతో కాదు, త్యాగముతో కనిపించాలి
D) స్నేహితులుగా పిలిచిన క్రీస్తు :- స్నేహితులము మనము. ఎలా మరిచిపోగలము.
E) ఎంపిక మరియు ఫల ప్రధమయిన జీవితం :- మనము ఫలాలను ఇవ్వాలి. మనకు దేవుడు అనుగ్రహించిన బహుమతుల ద్వారా, లోకముపై ఉపయోగకరించు కోకుండా, దేవునిపై వాడాలి . ఆయన ప్రేమ కలకాలము వర్ధిల్లెల క్షణ క్షణం పాటుబడుతూ ఉండాలి ఆయన కోసం, పలించని యూదా వలె జీవించక, పలించిన మత్తియాసు వలె జీవిద్ధం.


కావున ప్రియ జానాంగమా యూదావలె క్రీస్తుపై దొంగప్రేమతో జీవించక దొంగ ప్రేమను కనపరచక, నిజప్రేమ ను అర్తం చేసుకుని ఆయన సేవలో రాణిదాం, ఆయన ప్రేమను ప్రకటిదాం, ఆయనతో సహవాసిగా జీవించుటకు మనలను మనము పునీత మత్తియాసు గారువలే సేవకు సంసిద్ధం అవుదాం, మన జీవితాలను మార్చుకుని క్రీస్తే నిజ మృత్యుంజయిడు అని బలముగా ప్రకటిదాం.


దేవుడు మనలను దీవించును గాక...

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN