మరియతల్లిని చూసి నేర్చుకుందాం - పోప్

జోసెఫ్ అవినాష్

13 May 2026

ఫాతిమామాత పండుగ సందర్భంగా జనరల్ ఆడియన్స్ లో భాగంగా విశ్వకాపరి పోప్ లియో XIV పరిశుద్ధ మరియమాతను సంఘ జీవితానికి పరిపూర్ణ మాదిరిగా చూపించారు.దేవుని పిలుపుకు మరియతల్లి చూపిన వినయం,విశ్వాసం,ప్రేమ ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన జీవన సాక్ష్యమని చెప్పారు.సంఘాన్ని కేవలం ఒక సంస్థగా కాకుండా,దేవుడు మనకు అప్పగించిన విశ్వాస కుటుంబంగా చూడాలని,అందులో ప్రేమతో,విధేయతతో,సేవాభావంతో జీవించాలని పిలుపునిచ్చారు.అలాగే మరియతల్లిని చూసి “నేను నిజంగా విశ్వాసంతో జీవిస్తున్నానా? సంఘంలో నా బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తున్నానా?” అని ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలని సూచించారు.చివరగా, కతోలిక శ్రీసభపై ప్రేమ మన అందరిలో మరింత పెరగాలని ప్రార్థించారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN