ఫాతిమామాత మహోత్సవం సందర్భంగా

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి

13 May 2026

నేడు,ఫాతిమామాత మహోత్సవం!
*******""""**""******"""***
సీ:
ఫ్రాన్సిస్, జసింతయు వారితో లూసియు
కలసియుండగ చూసి కరుణ తోడ,
ఫాతిమా నగరాన ప్రీతితో ఆ నాడు
దర్శన మొసగిన తల్లి వమ్మ!
జపమాల చెప్పెడి జనులకె ప్పుడును
జయములే కలుగునీ జగతి లోన,
జపమాల శక్తిని చాటి చెప్పాలంటు
ఆ బాల త్రయమునే అడిగినావు !

తే. గీ:
అమ్మ! ఓ ఫాతిమా మాత! ఆదరించు!
కరుణ తోడను మమ్ముల కనికరించు!
పండుగను జేయు భక్తుల కండ గాను
నిలువుమో తల్లి, వేడేము నిన్ను విడక!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN