ఆయన వాక్కు ప్రకారం జీవిద్దాము
.jpg)
బ్రదర్ టోనీ నాగిపోగు MSC
12 May 2026
పాస్క ఆరవ బుధవారము
మొదటి పఠనము :అపో 17:15, 22-18:1
సువిశేషపఠనము : 16:12-15
(యోహాను 16:12.....నేను మీకు అనేక విషయములను చెప్పవలసి ఉన్నది. కాని ఇప్పుడు వానిని భరింపలేరు)
ఏతెన్సు నగరం, విద్య, తత్వశాస్రం మరియు విగ్రహారాధనలకు ప్రసిద్ధి పొందింది. ఇటువంటి చోట పునీత పౌలు గారు దేవుడు ఒక్కడెనని, ఆయన సృష్టికర్తయని, మనిషి దేవుణ్ణి వెధకి ఆయనకు దగ్గర అవ్వాలని, విగ్రహాలు దేవుని ప్రతిరూపాలు కావని, మనకు తీర్పు తీర్చబోయే ఒకే ఒక దేవుడు మన క్రీస్తువారని, మారాలని, నిజాన్ని తెలుసుకోవాలని, సత్య దేవుణ్ణి అనుసరించాలే కానీ, జీవం లేని విగ్రహాలను కాదని కలాకండిగా ఆయన బోధన చేశారు.
అన్ని చదివాము అంటే, అంత తెలుసు అని కాదు, అంత తెలుసు అంటే, అన్నింటిలో ముందు ఉన్నామని కాదు. ఎంత చదివినా, ఎన్ని డిగ్రీ పట్టాలు పట్టిన, ఎంత బుకిష్ జ్ఞానము వున్న, అర్తం చేసుకోలేని, ఆతేలివితేటలు లేకుంటే అంత శూన్యమే... ఇవన్నీ ఎందుకు చెప్పుతున్నాను అంటే...... ఏతెన్సు లో ప్రజలు జ్ఞానము గలవారు. కానీ అంత మేధస్సు వున్న వారు మెతుస్సులు అయ్యారే కానీ, మేధస్సులు కాలేకపోయారు, నిజ దేవుణ్ణి తెలుసుకోలేక పోయారు. విగ్రహాలు దేవుళ్లనుకున్నారేగాని, క్రీస్తు నిజమైన దేవుడని గుర్తించలేకపోయారు. విగ్రహాల ఫాంటసీ లో జీవించారేగాని, క్రీస్తు జనన, మరణ మరియు పునరుత్తానాలలో భాగస్వామ్యం వహించలేకపోయారు. అంత ఉపాయం వున్న పౌలు గారి బోధనలను హేళన చేశారు, నవ్వారు,... గెలిచేశారు, పునరుత్తానమా,... నిజమా, అంటూ హేద్దెవలు చేశారు.
ప్రియులారా నిజమైన జ్ఞానం దేవుణ్ణి తెలుసుకోవటములో ఉందని వారు గ్రహించలేకపోయారు. దేవుడు మన వరప్రధాత అని అర్తం చేసుకోలేకపోయారు. అలాంటి సంఘములో కూడా బలముగా దైర్యముగా దేవుని సువార్త చేసిన ధైర్య సేవకుడు మన పౌలు గారు.
యోహాను 16:14...ఆయన నన్ను మహిమపరిచ్చెను. ప్రభువారి బోధన రోజురోజుకి శిస్యులకు దూరాన్ని పెంచుతు వుంది. ప్రభువారి మాటలు దూరణ్ణి చేస్తున్నాయని, గ్రహిస్తున్నారేగాని, ఆయన మోక్షారోహణం తరువాత రానున్న మహిమను గ్రహించలేకపోతున్నారు శిష్యులు. నేను వుంటాను, నేను ఉండువాడను, నేను వదలను, విడువను, ఎడబాయను, మీ చెయ్యి వదలను, మీతో 24/7 వుంటాను, అని అభయమిస్తున్న వాక్కు అర్తం కాకపోతుంది శిష్యులకు. ఆయన సర్వంతర్యామి, ఆయన చూచువాడు, మేపువాడు, కాచువాడు, ఆదరించువాడు, అన్నీ ఒసగువాడు, అన్ని ఇచ్చువాడు, కాచుకుని మనలను ప్రేమించువాడు, మనవాడు, మన కుటింబికుడు అని మరచిపోవద్దు ప్రియులారా.
ఇంతటి అభయవాక్కును బోధిస్తుంటే, శిష్యులలో భయం, అమాయకత్వం, అసమర్ధత, వణుకు, ఈయన వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటో, మేము ఏమై పోవాలి, అనునటువంటి భయ్యాందోళన మొక్కలు వలె పెరుగుతున్నాయి, కానీ ఆ సందర్బములో రానున్న సత్యాత్మ మిమ్ములను ఆదరించును అని బోదిస్తున్న బోధనను స్వీకరించాలంటే కష్టంగా మారింది వాళ్లకి. కానీ మన మెసేయ్య మనలను విడచి ఎక్కడికి వెళ్ళడు దీనిని మనము అర్తం చేసుకోవాలి ప్రియులారా. నీవు నేను మనము ఆయనను వదిలి లోకములో ఒక్కటి అవుతాము ఆయన మాత్రం కాదు. కావున ఆయనను అర్తం చేసుకుందాము, ఆయన వాక్కు ప్రకారం జీవిద్దాము, ఆయనకై జీవితకాలము మనలను మనము అంకితం చేసుకుందాము.
దేవుడు మనలను దీవించును గాక...
