మన జీవన విధానం ద్వారా క్రీస్తును ప్రకటిదాం

బ్రదర్ టోనీ నాగిపోగు MSC
10 May 2026
పాస్క ఆరవ సోమవారము
మొదటి పఠనము : అపో 16:11-15
సువిశేషపఠనము : యోహాను 15:26-16:4
ప్రియులారా సువార్త ప్రచార పరిస్థితులలో మన దేవుడు నవ్యమైన ద్వారాలు మనకోసం తెరుస్తాడు. సువార్త సేవా విస్తరణలో మనకు వెన్నంటివస్తున్న వ్యతిరేకతలైతేనేమి, లోక అడ్డంకులయితేనేమి, లోక ఎదుర్బాటులయితేనేమి, ఇవి ఏవియు కూడా మనలను ఆపలేవు, మనకు అడ్డుగా ఉండలేవు. ఎందుకంటే ఆయనకోసం పరితపించే తన సేవకులతో ఆయన నిత్య నివాసియై, నిత్య సహకారియై, నిత్య సహచరుడై, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, తాను మనకు అన్నివేళలా సహాయపడుతూ అండగా, నిండుగా మనతోనే ఉంటాడు.
లూదియా అనే స్త్రీ పౌలు మరియు తన అనుచరులకు సహకారినై, అదితులను తన ఇంటికి పిలిపించుకుని, తన విశ్వాస సేవాబావమును చాటి చెప్పుతుంది. స్నేహబావం అనేది క్రైస్తవజీవితానికి ఆదర్శమని ఈ లూదియా స్త్రీ మనకు తన క్రియలరూపములో కన్నులవిందుగా తెలియజేస్తుంది. ఉన్నదానిలోనే ఇస్తూ సేవకులకు తోడుగా నిలుస్తుంది. నేను పై విధముగా వివరించినట్టు, సువార్త సేవలో నవ్య తలుపులు మన దేవుడు మనకై తెరిచే ఉంటాడు. ఇక్కడ దేవుడు లూదియా స్త్రీ రూపములో తెరచి, సువార్త చేస్తున్న సేవకులకు తనకు ఉన్నదానిలో ఇస్తూ, అతిధులను సత్కరిస్తుంది. కొండంత ఆశీర్వాధాలను, నిండైనా దీవెనలను, వారి ద్వారా పొందగలిగింది ఆమె.
చిన్న సహాయమయినా గొప్ప మనసున్న హృదయశీలి ఆ me. తన ఇంటిలోకి రావాలని పట్టు బిగించిన ఆస్రీకి పట్టనంత ఆశీర్వాదం దక్కింది. ప్రియులారా విశ్వాసుల కుటుంబాలలో కొన్ని సార్లూ ఊహించని పరిణామాలు సంబవిస్తూ ఉంటాయి, జరిగే ప్రతి సంఘటన మనమేలుకె అని గుర్తించాలి. మన కష్ట, పల ఉత్సవాలకు మనతో తోడుగా ఉండేది ఆదరణ కర్త అని మరువకూడదు. మనకు ఆయన ఎల్లకాలము మనతోనే ఉంటాడు. పరిస్థితులు ఏవైనా సాక్షమివ్వటం ప్రతి విశ్వాసి పిలుపు. నిజమైన విశ్వాసి జీవితములో జరగరానివి జరిగిన, కష్ట, నష్ట, హింస, తిరస్కరింపు మనకు నీడవలే వెంబదించిన మనకు ఆదరణ కర్త అన్నింటికీ ఒకరోజు సమాధాన కర్తయై నిలుస్తాడని మరువకూడదు. కష్టాలను ఎదుర్కొనబోయే శిస్యులకు ముందుగా వివరించి, క్లుప్తముగా చెప్పుతూ వారిని బలపరుస్తున్నారు మన క్రీస్తువారు. మనలను ఒంటరిగా వదలిపెట్టేవాడు కాదు, అన్నీ విధాలుగా అన్నీ సందర్భాలలో తోడుగా, అండగా, వుండే గొప్ప పునరుత్తాన మహోన్నత్తుడు సజీవుడు మన క్రీస్తు వారు.
లూదియా ద్వారా తన సేవకులకు తోడై నిలుస్తున్నాడు. దీని ద్వారా ఏమి అర్తం అవుతుంది మనకు... ఏమి ధ్యానం చేసుకోవాలి మనము........
తను మనకొరకు వున్నాడని తెలియటం లేదా
తను మనకు అన్నింటిని వసగుతాడని
తను మనకై నిలబడుతాడని
తను మన వాడెనని
తను మనకై పరితాపపడుతాడని
తను మనకై మాట్లాడుతాడని
తను మనకై పంపుతాడని
తను మనకై ఆశీర్వాధాకరమని
తను మనకు దీవెనని
తను మన రక్షనని
తను మన మేల్కొల్పని
తను మన నిత్య నివాసమని
తను మన ఆరాద్యమని
తను మన పునరుత్తానుడని
తను ఉండువాడని........
కావున ప్రియులారా నిరూత్సాహ క్రైస్తవులమై జీవించక, ఉల్లాస, ఉత్సాహ క్రైస్తవులుగా జీవిస్తూ, మన మాట, మన బాట, అన్నియు కూడా క్రీస్తులో ఉంచుదాం. మన జీవన విధానం ద్వారా క్రీస్తును ప్రకటిదాం.
