ప్రేమతో జీవిద్దాము, క్రీస్తులో నిలుద్దాము

బ్రదర్ టోనీ నాగిపోగు MSC

09 May 2026

పాస్క ఆరవ ఆదివార ప్రసంగ ధ్యానాంశం
మొదటి పఠనము : అపో 8:5-8, 14-17
రెండవ పఠనము: 1 పేతురు 3:15-18
సువిశేష పఠనము : యోహాను 14:15-21
ప్రియులారా మన దేవుడు మనలను మరిచే వాడు కాదు, దూరం చేసేవాడు కాదు, దూరముగా ఉండేవాడు కాదు, మనలను విడిచి, దూరమై పోయి, ఆనందముగా ఉండేటటువంటి దేవుడు కాదు మన దేవుడు.

యోహాను 14:16........ఆదరణ కర్తను మీకు అనుగ్రహించేదను అని పలుకుచున్నాడు. మనకు అన్నీ విషయాలలో తోడుగా ఉంచడానికి, నీడగా ఉండడానికి మనలను విడవకుండా ఉండుటకు, న్యాయస్థానములో సాక్షం ఇవ్వుటకు, పాపపు ఊబీలో ముద్దయిల నిలబడిన మన తరుపున వాదించుటకు, సలహాలు ఇవ్వుటకు, నిరాష, నిస్పృహ లలో వున్నా వారికి అతిశమీపములో ఉండుటకు, అవసరమయినా వ్యక్తిగ మనకు సహాయం చేయుటకు ఆదరణ కర్తను పంపుటకు ఆయన సంసిదముగా వున్నాడు. నీవు మరిచిపోతావు, నీ పరిస్థితులను బట్టి, నీ స్థితిని బట్టి, నీ కుటుంబ వ్యవస్థను బట్టి, కానీ మన దేవుడు మరువడు. ఆధరణ కర్తను మనకు ఇస్తున్నాడు. విశ్వాసములో సన్నగిళ్ళకూడదు అని, లోక వ్యసనలను దగరకు రానివ్వకూడదు అని, మన విశ్వాసములో తోడుగా, నమ్మకములో తోడుగా, భవిష్యత్తు లో తోడుగా, మన కుటుంబ పౌష్టిక వ్యవహారికై, ఆత్మీయ అనుబంధం కోసం, ప్రేమ కోసం, మంచికి, నీతికి, ధర్మానికి, న్యాయానికి, నీవు కూడా ఒక ప్రతిపదార్తం ల నిలుస్తావని, నిలవాలని, ప్రపంచం దాని సరిహద్దుల వరకు సువార్తను తీసుకువెళాలని, సువార్తను అందరికి పరిచయం చేయాలనీ, లోక దంబాములలో మునగకూడదు అని, దైవ ప్రస్తావన గావించాలని, నీకోసం, నాకోసం, మన అందరికోసమై, ఆయన ఆదరణ కర్తను పంపుతున్నాడు. గుర్తించుకోవాలి కేవలం మన కోసమే ఆయన ఇవ్వని చేసేది అని.

యోహాను 14:21......నా ఆజ్ఞలను పాటించు వాడు... నన్ను ప్రేమిస్తాడు........ ప్రియాజానంగామా నీ పొరుగువారిని, నీవలే ప్రేమించు, ఇతరులకు అన్యాయం చేయాలనీ భావించకు,... ఒకవేళ చేస్తే అన్యాయం ఆగుటకు సంసిదముగా వుండు. చెడునా,... చెడయ్ పోవుటకు...... నాశనాన్న..... నాశనమై పోవుటకు,....... హేళననా......... హేళనగా మారుటకు....... అగర్వాపరుచుట్టాక...... ఆవిధముగా అవ్వుతాకు...., అమర్యాధన... అమర్యాద్దకు... అవినీతా... అవినీతిగా మారుటకు.. మాటలతో, దూరబుదితో, కుట్రలతో, పన్నాగాలతో, ... ఏవీ నాటుతావో వాటినే కోయుటకు సంసిద్ధం గా వుండు... కావున అటువంటి వాటికి దూరమై పో... నీ పొరుగువానిలో క్రీస్తును చూసే ఆత్మీయతను అలవరచుకో...... అది నిజమైనా క్రీస్తు సేవకుని లక్షణం.
మత్తయి 5:16......ప్రజలు మీ సత్కార్యాలను చూసి.... ప్రకాశ్నింపనిండు.... మనము చేసే క్రియలను బట్టి ఆయన ఘనత పొందాలి. ఆయన స్తుతింపబడాలి, ఆయన హెచ్చింపబడాలి, ఆయన కీర్తింపబడాలి.... ప్రకాశవంతము గా మారి, ఆ వెలుగైన క్రీస్తును చీకటి లో వున్నా వారికి అందించాలి. ప్రతి ఒక్కరు వెలుగై జీవించాలని, మహిమను ఇతరులకు తెలియజేయాలనీ, ఆయనను అందరికి ఎరుగ పరచాలని, ఇతరుల జీవితాలలో మనము వెలుగై, మన మాట, బాట, క్రియ ల ద్వారా ఇతరులు చూసి క్రీస్తును అనుసరించాలని, ఆయనను సంపూర్ణముగా తెలుసుకోవాలని మనకు అర్తం కావటం లేదా,....

ప్రియులారా....... అన్యుల మధ్య ప్రకాశింపనిదాం , వెలుగుదాం, తెజోమాయులమై పునరుతానా క్రీస్తును..... ప్రకటిదాం.
యోహాను 14:18.....నేను మిమ్ములను ఆనాధలుగా విడిచిపెట్టను అని పలుకుచున్నాడు...
ముసలి వాళ్ళు అయినా అబ్రహం మరియు సారా లను, అనామకురాలు అయినా ఎస్తేర్ ను విడిచి పెట్టాడా, విధవరాలు అయినా రూతు ను, బానిసలయినా ఇజ్రాయెల్ లను , దావీదు ను, మోషే ను, హన్నా ను, తోబియా ను, యోసేఫ్ ను, దానియేలును తన స్నేహితులను, యోనా ను, ఏలీయాను, విధవారాలును, ఎవరినైన అనాధగలుగా విడిచిపెట్టాడా లేదు కదా,.... కొంతమంది వుంటారు అండి, దేవుడు లేడు, మరిచిపోయాడు, మేము అంటే ఇష్టం లేదు, మాపై పగపట్టాడు, మా కుటుంబం అంటే ఇష్టం లేదు, లేనిపోనివి అంటూ..... దేవుని నిందిస్తూ ఉంటాము కానీ ఆయన మనలను వదలలె దు,.. మన తోనే వున్నాడు, మనతోనే ఉంటాడు, మనకై ఉంటాడు అని గుర్తించక లోకస్తుల వలె ఆయనను అనరాని మాటలు అంటూ ఉంటాము... కానీ ప్రియులారా చూడండి మన పవిత్ర గ్రంథములో ఎవరినైన ఆనాధలుగా విడిచి పెట్టాదేమో...... ఆయనను అర్తం చేసుకోవాలె గాని అపార్తం చేసుకోకూడదు ప్రియలారా... కావున... దీనిని గ్రహించి, ఆత్మీయ అడుగులు వేయుటకు సంసిద్ధం అవుదాం.
మత్తయి 28:20...... లోకాంత్యము వరకు నేను మీతోనే వుందును అని ఆయన సెలవిస్తున్నాడు. మనము భక్తి ni వదిలి అనరాని మాటలు అని, ప్రబ్బాదులుగా మారి, ఆయనను చీకోట్టి, ఆయనను అన్నీ విధాలుగా ద్వేసించి కష్టపెట్టి, ఆయన చేసిన మేలులను ఎప్పటికప్పుడు మరిచిపోతు,.. దేవుడు లేడు ఎవరు లేరని గంతులు వేస్తువుంటాము... కానీ మన దేవుడు మాత్రం వదలను... అన్నీ వేళల్లో తోడుగా వుంటాను అని అంటున్నాడు.... మరి మనము ఆయనను అర్తం చేసుకుని జీవించే ఆత్మీయ అనుభవం మనకు కలగాలని మనసారా ఆయనను వేడుకుందాము.
అపో 8:8......అందుచే ఆ నగరములోని జనులు ఎంతో సంతోషించిరి. ఎందుకు సంతోసించారు, ఏమైంది, అంటే.... పిలిప్పు బోధన ద్వారా నిజ సత్య పునరుతానా క్రీస్తు నామములో ఎందరో ఆదరణ, స్వస్థతల రూపములో, అద్భుత కార్యాల రూపములో అక్కడ కన్నుల పండుగగా వున్నింది. ఎందరికో ఊరటను ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు, అన్యులను క్రీస్తుకు దగ్గర చేసాడు, తెలియని వారికి తెలియజేసాడు, డబ్బర దేవతలకు fullstop చెప్పి, కొత్త జీవితానికి నాంది పలికాడు. ఇవ్వన్నీ చూసి అనుభవించిన వారిలో సంతోషం పొంగి పోర్లింది, అనుమానం, పరిగెత్తింది, మరి మనము, ఆ పునరుతానా సంతోషమును అనుభవిస్తున్నామా, లేదా అని ఆత్మపరిశీలన గావించుకోవాలి ప్రియులారా...
1 పేతురు 3:18..... మీ హృదయము నందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్టహించుకొనుడు... ఎందుకు ప్రతిష్టించుకోవాలి అంటే....... మన పాపాలకై మరణించడని, మన భారమును తన బుజాలపై వేసుకున్నాదని, మనందరికీ రక్షణను ప్రసాధించాడు కాబట్టి, ప్రేమను క్రియాలరూపములో చూపించాడు కాబట్టి, ఎంతగానో మనకై శ్రమించి, పునరుతానుడై మనకోసం తిరిగి వచ్చాడు కాబట్టి, నిత్య ఆత్మీయతను కనపరచ్చాడు కాబట్టి, మన హృదయాలలో ఆయనను ఉంచుకోవాలి మరియు ప్రతిష్టించుకోవాలి . ఆయన ప్రేమ మనపై ఎంతగానో కుమ్మరింపబడింది అని, ఏమయినా చేయగలడు, చేసే శక్తివంతుడు అని, ఆయనను మనము దృదముగా విశ్వసించి, మన జీవితాలలో ఆయన ప్రేమను అడుగడుగునా ప్రతి ద్వారాము ముందు ప్రకటింప విస్తరణ చేయ గావింపబడాలని, తల్లి శ్రీసభ మన అందరితో ఈ ఆదివారా పఠనలా ద్వారా బోధిస్తుంది. కావున మనము ఆ వెలుగును, చీకటిలో వున్నా వారికి కనపరుస్తూ, క్రీస్తుఉత్తనా ప్రకాశవంతమును లోకానికి అందజేద్దాము......
దేవుడు మనలను దీవించును గాక

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN