పేదలలో పునరుత్థాన క్రీస్తును దర్శించండి - పోప్

జోసెఫ్ అవినాష్

08 May 2026

విశ్వ కాపరి పోప్ లియో తన పోంపేయిలోని “Temple of Charity” సందర్శనలో బాగంగా అక్కడ సేవ చేస్తున్న వాలంటీర్లు,సిస్టర్లు,సేవా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ,పేదలు, రోగులు,బాధలో ఉన్నవారికి చేసే ప్రతి సేవలో క్రీస్తు పునరుత్థాన శక్తి ప్రతిరోజూ పనిచేస్తోందని చెప్పారు.సేవ చేయడం కేవలం ఒక బాధ్యత కాదు,అది సువార్తను జీవితం ద్వారా ప్రకటించే మార్గమని గుర్తుచేశారు. అలాగే ఎలాంటి కష్టాలు వచ్చినా మనలను ఎప్పటికీ విడిచిపెట్టని స్నేహితుడైన యేసుక్రీస్తుపై సంపూర్ణ విశ్వాసం ఉంచాలని ప్రోత్సహించారు.ప్రేమతో చేసిన చిన్న సేవ కూడా దేవుని రాజ్యాన్ని నిర్మించే గొప్ప సాక్ష్యమవుతుందని పోప్ తెలియజేశారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN