మనుజుల విడదీసి కినుక పెంచు!.

డా. కల్లూరి ఆనందరావు
07 May 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
......................................................
కండకావరమ్ము బండతనము నేర్పు!
బంధుమిత్రులందు పగను పెంచు!
హెచ్చు తగ్గులనెడి వేర్పాటు ధోరణి
మనుజుల విడదీసి కినుక పెంచు!.
