ఆయనలోనే మనము రక్షిణపబడతాము

బ్రదర్ టోనీ నాగిపోగు MSC

07 May 2026

పాస్క ఐదవ శుక్రవారము
మొదటి పఠనము : అపో :15:22-31
సువిశేష పఠనము :యోహాను 15:12-17
ప్రియులారా మొదటి పఠనములో మూడు ముఖ్యమైన విషయాలపై ధ్యానం చేయవచ్చు.

A. రక్షణ కృపచేత వస్తుందే తప్ప మానవ మేధస్సు నుండి కాదు, మన ప్రయత్నాలు అన్నియు ఆత్మీయత లేకుండా, దేవుని సహకారం లేకుండా జరగాలంటే చాలా కష్టం అని తేటతేల్లం అవుతుంది.

B.ఐక్యతతో కూడిన ఆత్మీయత
దేవునికి ప్రియమము, దేవునికి ఇష్టం అయినట్టు వంటిది ఈ సుకృతం.

C.పరిశుత్మ నడిపింపు
ఈ నడిపింపు ఉంటే లోకాన్ని జయించగలము, స్వ శక్తులు, స్వభాలాలు ఏమాత్రం మనకు వర్తించవని, ఈ మూడు మనకు అతి ఆత్మీయమైన ఆభరణాలని మనకు వచనాలు తేటతేల్లం చేస్తున్నాయి.
క్రైస్తవ జీవితము అనేది క్రీస్తుతో నడవవలసిన జీవితము. క్రీస్తుని పోలి జీవింపవలయునది, క్రీస్తు నియమాలను నిక్కరుసుగా నిలకడగా పాటింపవలయునది. క్రీస్తును మన జీవిత విధానం ద్వారా ఇతరులకు చూపింపవలయునది, మనలోనేయితే ఏమి, మన కుటుంబాలలో అయితేనేమి, మన సమాజములో అయితే నేమి, క్రీస్తు centre of attraction అవ్వాలి, ఆయనను కానరాన్నివకుండా మనము సెంటర్ అయ్యి పోవటం కాదు. క్రీస్తు మనకు కేంద్రబిందువు అయి నిలిచిపోవాలి. ఆయన ప్రేమ మనకు ఆభరణమై నిలవాలి. ఆయన నిజము, ఆయన వాక్కు నిజము, ఆయన మాట, బాట, అన్నియు సత్యం.
మనపై ఆయన కనపరిచే ప్రేమ, ప్రేమ త్యాగముతో కూడినది, త్యాగనిది త్యాగము, నీకై, నాకై, మనకై, తన పోలికతో సృజింపబడిన మనకు అర్పించిన సత్య త్యాగం మన క్రీస్తుది. మనకై పరితపించే నిజ త్యాగం. మనలను తండ్రికి దగ్గర చేయాలనే ఆరాట త్యాగం. లోకములో మనలను ప్రత్యేకముగా మరల్చే సంతోష త్యాగం. లోకముతో సంబంధం థెంపాలానే త్యాగం, నీకు నాకు శ్రేష్ఠమైనది ఇవ్వాలనే త్యాగం, నీకోసం, నాకోసం, అల్లాడిపోయిన పరమణాధుని ప్రేమ సందేశం ఈ త్యాగం, ఆ త్యాగషీలిని మనము ప్రేమ అనే బంధముతో కలుపుకోవాలి, కలుసుకోవాలి, ఆనందధాయాకముగా మరల్చుకోవాలెగానే, కపటబుదితో కాదు.... ప్రియ జనంగామ మనము సామాన్యులము కాదు, ప్రత్యేకవిధముగా ఎన్నుకొనబడినవారము, నిలబెట్టబడినవారము, ప్రణాళికతో ఈ భువిపై అడుగుపెట్టినావారము, నిజ దేవుని ఆరాదికులము, పరలోక వాసులము, త్రిత్వయిక దేవుని ప్రియా బిడ్డలము, శాశ్వత నిత్య నివాస పౌరులము, సజీవ దేవుని విశ్వాసులము.
అందరివలే వారము మాత్రము కాదు, అందరివలే జీవించువారము కాదు, కాబట్టి పలింపబడాలి, పలాలను ఇవ్వాలి, పరిమలించే విశ్వాసలుగా రాణింపబడాలి, అన్నీ విధాలుగా పలాలను చేకూర్చాబెట్టాలి, పలించే మన విశ్వాస ప్రయాణం ఇతరులకు దేవుణ్ణి చూపించాలి. మన జీవిత ఫలితం... ఎలా ఉండాలి అంటే విఫలమయినా ఎందరి జీవితాల్లో ఆనందమును ఇవ్వాలి. అటువంటి వారికీ నిదర్శనం అవ్వాలి మనము, మన క్రీస్తువలే ఆయన పలించిన విధముగా, పలించి, పలాలను ఇచ్చి, ఎందరికో రక్షణ ఇచ్చినవిధముగా ఆయనను మనము పోలి జీవించాలి, ఆయనను తెలియని వారికి తెలియ జెప్పాలి, క్రీస్తే మన రక్షకుడు, ఆయనలోనే మనము రక్షిణపబడతాము అని మన జీవిత విధానాల ద్వారా చాటి చెప్పుదాం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN