దేవుని ప్రేమను ప్రకటిద్దాం

బ్రదర్ టోనీ నాగిపోగు MSC
06 May 2026
పాస్క ఐదవ గురువారము, 07-05-2026
మొదటి పఠనము : అపొస్తుల : 15:7-12
సువిశేష పఠనము : యోహాను 15:9-11
ప్రియులారా(అపో 7-11) లో మనము పేతురు గారి సాక్షమును చూడవచ్చు. దేవుడు యూధులు మరియు అన్యుల మధ్య తేడాలను చూసేవారుకాదని, ఆయనకు బేధభిప్రాయాలు ఉండవని బోదిస్తున్నారు. విశ్వాసం ద్వారానే రక్షణ అని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 12 వ వచనములో పౌలు మరియు బర్నబాల సాక్షం,... వారు అన్యజనుల మధ్య చేసిన అద్భుతకార్యాలను వివరిస్తున్నారు. 13-21 లో అన్యజనులు యూదా ధర్మశాస్త్రన్ని అనుసరించాల్సిన అవసరం లేదని, కొన్ని ముఖ్యమయినా వాటిని తప్పించుకోవాలని... అవి.... విగ్రహాలకు అర్పించిన ఆహారం, వ్యభిచారం మరియు గొంతునులిపిన జంతువుల మాంసం మరియు రక్తం.
ప్రియులారా మనము బేధభిప్రాయాలు చూపిస్తాము, తేడాలను సృష్టిస్తాము, కుల, మత, రంగు, వర్గ, జాతి, అంటూ మానవత్వన్ని కోల్పోతూ సాటి మానవున్ని జంతువుల చూస్తాము కానీ, మనలను సృజంచిన సృష్టికర్త, మనలను ఎప్పుడు ఆలా చూడలేదు, చూడడు కూడాను. దేవుడు అంటే ప్రేమ, ప్రేమ అంటే దేవుడు..... దేవుని ప్రేమ సరిహద్దులు లేనిది. ఆ ప్రేమనే దేవుడు మన కొరకై తన ఏకైక కుమారుణ్ణి మనకోసం పంపాడు. ఆ కుమారుడు తన మరణం ద్వారా మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో, బోధన ద్వారానే కాకా క్రియలద్వార కూడా చేసి చూపేట్టాడు. ఆ ప్రేమను మనము అర్తం చేసుకోలేక మెసయ్య ఈ వర్గం వారికోసం, ఆ వర్గం వారి కోసం, యూదుల కొరకు మాత్రమే అంటూ మనము వాపోతున్నాము కానీ, నిజ, సత్య, సజీవమైన క్రీస్తు ప్రేమ అవధులు లేనిదీ, అందరికి చెందవలసినది, అందరూ భాగస్వామ్యం పొందుకోవలసినది, అందరూ ఆహ్వానితులే కానీ, ఆహ్వానీతులు కానే కాదు, అందరం ఒకటే అని ప్రకటించాలి, విబేధాలు చేయకూడదు, ఆయన ప్రేమ ప్రపంచపు ఉనికికి అందేలా ప్రకటించాలి, ప్రాణం పోయేంత వరకు ఆయన ప్రేమను విస్తరణ చేయాలి.
ఆయన ప్రేమ నీపై ఎంతగానో ప్రజ్వారీళ్ళుతుంది కావున ఆ ప్రకాశవంతమయినా ప్రేమను వెధజల్లు... నీ క్రియలతో, రంగు చూడకు, మతం చూడకు, అందరిలో పునరుతానా క్రీస్తును చూడు, ఆయన ప్రతిబింబం ప్రతిఒక్కరిలో తేటతేల్లాముగా కనులరా చూడు, ఈయనే క్రీస్తని, గలమెత్తి ప్రకటించు. యేసే గొప్ప దేవుడు, యేసే మన దేవుడు అని జనములకు తెలియజేప్పు. ఆయన ప్రేమకు అంతం లేదని, కలకండిగా బోధించు. ఆ ప్రేమే నిన్ను, నన్ను మరియు మనలను నిలబెట్టింది.
ప్రేమలో నిలిచిపోవటం... దేవుడు....... యేసయ్య మరియు మనము నిస్వార్ధ ప్రేమ మరియు పరిపూర్ణ ప్రేమ. మనకు సంపూర్ణ ఆనందం. మనకు సంపూర్ణ బలం, బలగం, భవిష్యత్తు ఆయనే. కావున ప్రియులారా మన క్రీస్తు వలె ప్రేమ పూర్ణులామై, ప్రేమ కరుణాలమై, ప్రేమను పొందుదాం, ప్రేమను చూపిదాం, ప్రేమలో పయనింప చేదాం, దేవుని ప్రేమకై పరుగేడుదాం, ఆప్రేమను క్రియలలో మన క్రీస్తువలే పోలి జీవిదాం.....సంఘ ఐక్యతను మనము ప్రోత్సహిస్తాం, సంఘ పరస్పర గౌరవాన్ని నిలబెడదాం, సంఘ పరస్పర సమన్వయమును అందరిలో నాటుదాం,... ఆయన ప్రేమకు సరిహద్దులు లేవు, ఆయన ప్రేమ అందరికి అందుబాటులో ఉంటుంది, కావున విశ్వాసిదాం, ప్రేమిదాం, ప్రకటిదాం మరియు జీవిదాం.
