పేదల పక్షాన నిలబడటం శ్రీసభ బాధ్యత - పోప్
జోసెఫ్ అవినాష్
06 May 2026
జనరల్ ఆడియన్స్ సందర్భంగా విశ్వ కాపరి పోప్ లియో XIV, చర్చి అంటే కేవలం ప్రార్థనలు చేసే స్థలం మాత్రమే కాదని చెప్పారు. ప్రపంచంలో బాధపడుతున్నవారికి తోడుగా నిలబడటం, పేదలను ఆదుకోవడం, అన్యాయం మరియు చెడును ఎదిరించడం కూడా చర్చి బాధ్యత అని గుర్తు చేశారు. మన జీవితం ఈ భూమిపైనే ముగిసిపోదని, దేవునితో నిత్యజీవమే మన అసలైన గమ్యం అని చెప్పారు. అందుకే ప్రతి క్రైస్తవుడు విశ్వాసంలో నిలకడగా ఉండి, ప్రేమతో మరియు సేవాభావంతో జీవించాలని పోప్ పిలుపునిచ్చారు.
