క్రీస్తు సేవలో జీవిద్దాం

బ్రదర్ టోనీ నాగిపోగు MSC

05 May 2026

పాస్కా ఐదవ బుధవారము,
మొదటి పఠనము : అపోస్తుల : 15:1-6
సువిశేష పఠనము : యోహాను 15:1-8


యోహాను 15:4.....నేను మీయందు వుందును, మీరు నా యందు ఉండుడు.
ప్రియులారా యూధులలో కొంతమంది విశ్వాసులు రక్షణ పొందాలంటే, సున్నతి ప్రాముఖ్యమని, అది రక్షణ దాయకమని విభిన్నముగా మాట్లాడుతూ ఉంటే, పౌలు మరియు బర్నాబాలు మాత్రము క్రీస్తుపై విశ్వాసం చాలు రక్షణ తథ్యం అని బోదిస్తున్నారు. ఈ సమస్య పరిస్కారపూరితముగా పరిగనింపబడి, భిన్నత్వములో వున్నా మొదటి శతబ్దపు క్రైస్తవులలొ ఏకత్వాన్ని నెలకొల్పటం మనము చూస్తున్నాము. క్రీస్తులొ విశ్వాసం ఎన్నింటికో, ఎందరికో ఒక నీలవేత్తు నిదర్శనం.
ఎప్పుడు అయితే క్రొమ్మలు, డ్రాక్షావల్లికి కలిసివుంటాయో అప్పుడే అవి పలాలను ఇస్తాయి. మన అనుదిన జీవితములో మనము దేవునియందు ఉండాలి, దేవునితో ఉండాలి, దేవునికై ఉండాలి, మనము ఆయనతో ఉంటే మనలో భిన్నత్వాలు రావు, ఇగో లు పుననిర్మింపబడవు, ప్రపంచశక్తులపై కోరికలు వుండవు. మనము ఆయనలో సక్యపడితే సక్రమైన మార్గం మన వశం అవుతుంది. ద్రాక్షావల్లి అయినా మన దేవుణ్ణి అంటిపెట్టుకుని జీవించాలి. ఆయనను ఆలింగణం చేసుకోవాలి, విడువక ముందుకు సాగాలి, వదలక నడుంబిగించాలి. ఏ విధముగా అయితే క్రొమ్మలు ద్రాక్షావల్లికి దగ్గర అయ్యి పలాలను ఇస్తాయో, నీవు, నేను, మనము కూడా క్రీస్తనే ద్రాక్షావల్లితో పెనవిసుకుని జీవించాలి.
ఆయనతో మనము జీవిస్తే....... మన జీవితం ధన్యం, మన కష్టాలు మాయం, మన బాధలు అంతం, మన చింతలు దూరం, మన కన్నీరు అయోమయం, మన వేదనలు పరుగులు పెడతాయి, మరి నీవు, నేను మనము ఆయనయందు జీవిస్తున్నామా లేక లోకము యందు జీవిస్తున్నామా ఆత్మపరిశీలన గావించుకోవాలి.......
ఆయన యందు జీవిస్తే.............
నీకు ఆశీర్వాదం, నీకు దీవెన, నీకు పరలోకములో స్థానం, నీ జీవితం ధన్యం, నీకు నిత్య నివాసం, నీ జీవితం సుఖమయం, నీ జీవితం వేరే లెవెల్, ఆత్మీయత పెరుగుతుంది, ఏకత్వములో జీవిస్తావు, పలాలను ఇస్తావు, ఉదాహరణమైన జీవితాన్ని ఆవలంచేస్తావు, క్రీస్తును పోలినవాడిగా మారుతావు, క్రీస్తును ప్రకటింపబడిన వాడిగా తయారు అవుతావు, సమస్తమునకు దీవెనగా నెలకొల్పబడతావు, సాతనుకు శత్రువై పోతావు, లోకాశాలు నిన్ను లొంగదీయలేవు, లోకం నిన్ను నాశనం చేయలేదు, లోక స్థితులు నీ స్థితిని మార్చలేవు, లోక సంఘటనలు నిన్ను కలవరపడచలేవు,...

ఇలా కాకుండా నీవు
లోకం యందు జీవిస్తే.............
నీ జీవితం ఆగమవటం తథ్యం, నీ నాశనానికి నీవే ప్రాముక్యుడివి, సాతాను శక్తి నీలో ప్రవేశిస్తుంది, ఆత్మీయతలో రాణించలేవు, నీలో పైసాచ్చిక వ్యసనాలు యుద్ధం చేస్తాయి, త్రాగుడుకు నీవు అభ్యర్తిగా నిలబడతావు, లోకమే నిన్ను ముంచేస్తుంది, లోకాశలతో మురిపింపచేస్తుంది, లోకపోకదాలలో నీ బంగారు భవిష్యత్తు గంగార్పణం గావింపబడుతుంది. కావున దేవుని యందు ఉండాలని అనుకుంటున్నావా లేక లోకముయందు ఉండాలను అనుకుంటున్నావా నీవే ఆత్మపరిశీలన గావించుకో, మరి ద్రాక్షవల్లితో ముడిపడుదాం, ఇతర ముడులను ఇప్పేసి, కాళచేదాం, ఈ ద్రాక్షావల్లి మనలను దీవెనగా చేస్తుంది , లోకం మన ఆత్మీయతను మెరుగుపడేలా, మెరిసేలా చేస్తుంది, కావున ఆయన యందు ఉందాం, ఆయన సేవలో జీవిదాం, మరియు ఆయనకై పరితపించుదాం........

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN