పేదల సేవే క్రైస్తవ జీవితానికి హృదయం — పోప్ లియో XIV

జోసెఫ్ అవినాష్

05 May 2026

విశ్వ కాపరి పోప్ లియో XIV ఇటీవల జరిగిన వివిధ దాతృత్వ సేవా ప్రతినిధుల నాయకులతో జరిగిన సమావేశంలో హృదయానికి హత్తుకునే సందేశం ఇచ్చారు.పేదలు,బాధలో ఉన్నవారు,సమాజంలో అణగారినవారికి సేవ చేయడం అనేది కేవలం దాతృత్వ కార్యం మాత్రమే కాదు,నిజమైన క్రైస్తవ జీవితంలో విడదీయలేని భాగమని ఆయన చెప్పారు. సేవ చేసే మార్గంలో వనరుల కొరత,నిరుత్సాహం,అనేక అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గకూడదని ప్రోత్సహించారు. “మనము సహాయం చేయలేకపోయిన సందర్భాల్లో కూడా క్రీస్తు ‘నేను ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాను’ అని చెప్పే స్వరాన్ని వినాలి” అని పోప్ గుర్తుచేశారు.క్రీస్తు ప్రేమతో చేసే ప్రతి సేవ బాధపడుతున్న వారికి ఆశను,గౌరవాన్ని,కొత్త జీవనాన్ని అందిస్తుందని ఆయన వివరించారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN