పరలోక సంతోషాన్ని భువి పైనే అనుభవించండి - పోప్
జోసెఫ్ అవినాష్
04 May 2026
పస్కా కాలంలోని ఐదవ ఆదివారం సందర్భంగా పోప్ లియో XIV విశ్వాసులకు సువిశేష సందేశం అందించారు. యేసుక్రీస్తు చెప్పిన “మీ కొరకు స్థలము సిద్ధపరచుటకు వెళుతున్నాను” అనే వాక్యాన్ని ధ్యానిస్తూ, పునరుత్థాన వెలుగులో ఈ మాటలు మన హృదయాలకు ధైర్యం, ఆశను నింపుతాయని చెప్పారు. ఈ ప్రపంచంలో పేరు, ప్రతిష్ట, సంపద కోసం పరితపించే మనుష్యులకు, నిజమైన విలువ దేవుని ప్రేమలోనే ఉందని ఆయన గుర్తు చేశారు. విశ్వాసం మన హృదయాలను ఆందోళనల నుండి విముక్తి చేసి, ప్రతి వ్యక్తి దేవుని దృష్టిలో అమూల్యుడని తెలియజేస్తుందని వివరించారు. అలాగే క్రైస్తవులు ప్రేమ, సోదరభావం, శాంతి ద్వారా ఈ భూమిపైనే పరలోకానుభూతిని ప్రపంచానికి చూపించాలని, ప్రతి క్రైస్తవ సంఘం అందరికీ తెరిచి ఉన్న గృహంలా మారాలని పిలుపునిచ్చారు.
