కడలి లోతు మించి కార్యముండు!.

డా. కల్లూరి ఆనందరావు
02 May 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..............................................................
పట్టు విడుపు లేని పనులు వ్యర్థము కదా?
ముందు వెనుక చూచి అడుగు వేయి!
అందమైన అలలు అంబుధి యనుకోకు!
కడలి లోతు మించి కార్యముండు!.
