మే నెల ప్రార్థనా ఉద్దేశాన్ని ప్రకటించిన పోప్
జోసెఫ్ అవినాష్
01 May 2026
విశ్వ కాపరి పోప్ లియో XIV మే నెల ప్రార్థనా ఉద్దేశాన్ని ప్రకటించారు.“ప్రతి ఒక్కరికీ ఆహారం లభించాలని” ఎవ్వరూ ఆకలితో ఉండని ప్రపంచం స్థాపించబడాలని,ప్రతి ఒక్కరు ప్రార్థించాలని ఆయన కోరారు.ప్రపంచంలో ఎంతోమంది ఆకలితో బాధపడుతుండగా,మన దగ్గర ఉన్న ఆహారం ఎంత సులభంగా వృథా అవుతుందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని పోప్ తెలియపరిచారు.భూమి ఇచ్చే వరాలు అందరికీ సమానంగా చేరాలి గానీ కొద్దిమందికే పరిమితం కాకూడదని ఆయన గుర్తుచేశారు.అందుకే మన జీవనశైలిలో మార్పు అవసరం అవసరమైనంత ఆహారం మాత్రమే వినియోగించడం,మిగిలినదాన్ని పంచుకోవడం, ఆహారాన్ని గౌరవంగా చూడడం.స్వార్థపు వినియోగం స్థానంలో పరస్పర భాగస్వామ్యం,సహోదర భావం పెంపొందితేనే ఎవ్వరూ ఆకలితో ఉండని ప్రపంచం సాధ్యమవుతుంది.ఈ ఉద్దేశంతో ప్రార్థిస్తూ,మనం కూడా చిన్నచిన్న చర్యలతో ఈ మార్పుకు తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు.
