శాంతి సందేశంగా ఆఫ్రికా పర్యటన – పోప్ లియో XIV
జోసెఫ్ అవినాష్
29 Apr 2026
విశ్వ కాపరి పోప్ లియో XIV ఇటీవల ఆయన చేసిన ఆఫ్రికా పర్యటనను శాంతి సందేశంగా వివరిస్తూ,ప్రపంచంలో పెరుగుతున్న యుద్ధాలు,హింసల మధ్య మనుషులందరూ ఐక్యతతో,సహోదర భావంతో జీవించాలని పిలుపునిచ్చారు. అల్జీరియా,కామెరూన్,అంగోలా,ఈక్వటోరియల్ గినియా దేశాలను సందర్శించిన సందర్భంగా ఆయన మతాల మధ్య సంభాషణ,మానవ గౌరవం,న్యాయం మరియు శాంతి కోసం కలిసి పనిచేయడం ఎంత ముఖ్యమో గుర్తుచేశారు.ఆఫ్రికా ప్రజలు ఎదుర్కొంటున్న బాధలు,అసమానతలు,కాలనీయ ప్రభావాలను గుర్తిస్తూ,మంచి భవిష్యత్తు కోసం పరస్పర సహకారం అవసరమని చెప్పారు.
