ఆంగ్లికన్,కతోలిక సంఘం ఇరువురు కలిసి సువార్త వ్యాప్తిలో భాగం కావాలి - పోప్

జోసెఫ్ అవినాష్
28 Apr 2026
విశ్వ కాపరి పోప్ లియో XIV ఆంగ్లికన్ క్రైస్తవ సంఘానికి చెందిన ఆర్చ్‌బిషప్‌గా నియమితులైన తొలి మహిళ సారా ముల్లాలీని ఆత్మీయంగా కలుసుకున్నారు.ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వక సమావేశం మాత్రమే కాదు.శతాబ్దాలుగా వేరుపడిన కతోలిక మరియు ఆంగ్లికన్ సంఘాలు పరస్పర సమీపానికి రావాలనే సంకల్పానికి ఇది ఒక సంకేతం.ఇద్దరూ కలిసి ప్రార్థిస్తూ,ప్రపంచంలో శాంతి, న్యాయం,ఐక్యత కోసం కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు.విశ్వాస పరమైన కొన్ని భేదాలు ఇంకా ఉన్నప్పటికీ,ఈ సమావేశం “విభేదాల కంటే ఐక్యత ముఖ్యము” అనే సందేశాన్ని బలంగా తెలియజేసింది.
