త్వరలో శ్రీసభలోకి మరో 49 పునీతులు
జోసెఫ్ అవినాష్
28 Apr 2026
విశ్వ కాపరి పోప్ లియో XIV ఇటీవల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను ఆమోదించారు. వీటితో స్పెయిన్, ఇటలీ, నెదర్లాండ్స్‌కు చెందిన పలువురు దేవుని సేవకుల జీవితం అధికారికంగా గుర్తింపు పొందింది.ముఖ్యంగా, స్పెయిన్‌లో జరిగిన హింస సమయంలో తమ విశ్వాసం కోసం ప్రాణాలు అర్పించిన 49 మంది క్రైస్తవుల త్యాగాన్ని శ్రీసభ సాక్ష్యంగా గుర్తించింది.త్వరలో వీరికి పునీత పట్టం విశ్వ కాపరి పోప్ లియో XIV ఇవ్వనున్నారు.
