చేయి చాచకుండ! చేయు సుమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
25 Apr 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
......................................................
అందిన ప్రతి రూక! అపుడె పెట్టకు ఖర్చు!
కొంత శాతమైన కూడబెట్టు!
అవసరమ్ము లోన అభ్యాగతి వగుచు
చేయి చాచకుండ! చేయు సుమ్ము!.
