నేను యుద్ధానికి వ్యతిరేకం - పోప్
జోసెఫ్ అవినాష్
25 Apr 2026
ఆఫ్రికా అపోస్తలిక పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రెస్ సమావేశంలో విశ్వ కాపరి పోప్ లియో XIV ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించారు.ఒక శ్రీసభ కాపరిగా తాను ఎప్పుడూ యుద్ధానికి మద్దతు ఇవ్వలేనని స్పష్టంగా చెబుతూ,నిరపరాధుల ప్రాణాలు రక్షించడం ప్రతి దేశం బాధ్యత అని అన్నారు.ప్రపంచంలో పెరుగుతున్న హింస,యుద్ధ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసి,శాంతి కోసం దేశాలు నిజమైన చర్చలు జరపాలని పిలుపునిచ్చారు.ఒక చిన్న బాలుడి మరణాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనైన ఆయన, మానవత్వం కోల్పోతే ప్రపంచానికి భవిష్యత్తే లేదని హెచ్చరించారు.వలసలు,సమానత్వం వంటి అంశాలపై కూడా స్పందిస్తూ, శ్రీసభలో ఏకత్వం మరియు ప్రేమ అత్యంత ముఖ్యమని చెప్పారు.
