“దేవుని ప్రేమకు గోడలు లేవు – ఖైదీలకు ఆశ నింపిన పోప్”
జోసెఫ్ అవినాష్
24 Apr 2026
విశ్వ కాపరి పోప్ లియో XIV అపోస్తలిక పర్యటనలో భాగంగా
బాటానగరంలో ఉన్న జైలును సందర్శించి ఖైదీలతో ముచ్చటించారు.జైల్లో ఖైదీల పరిస్థితి ఎంత కష్టమైనదైనా, వారు దేవుని ప్రేమకు దూరం కాదని ధైర్యం చెప్పారు. జైలు అనేది కేవలం శిక్షించే స్థలం కాదు,మనసు మారి జీవితాన్ని మళ్లీ ప్రారంభించడానికి ఒక అవకాశమని వివరించారు.మనిషి చేసిన తప్పు అతని కథను ముగించదు; మార్పు ద్వారా కొత్త భవిష్యత్తును నిర్మించుకోవచ్చని ప్రోత్సహించారు.నిజమైన న్యాయం శిక్షతో ముగియకుండా, మనిషిని తిరిగి నిలబెట్టడంలో ఉందని ఆయన స్పష్టం చేశారు.చివరగా, “మీరు ఒంటరిగా లేరు… దేవుడు ఎప్పుడూ మీతోనే ఉన్నాడు” అని వారికి ఆశను నింపారు.
