పునీత పేతురు విశ్వాసాన్ని అనుసరిద్దాం

Father gopu praveen
24 Apr 2026
పాస్కా 3వ శనివారం
అ.కా 9:31-42
కీర్తన 116:12-17
యోహాను 6:60-69
పేతురు ఓ విలక్షణమైన వ్యక్తి. అందరు అలోచించి మాట్లాడితే ఇతగాడు మాత్రం ముందు మాట్లాడి ఆపై ఆలోచిస్తాడు.అందుకే పలుమార్లు చిక్కుల్లో పడ్డాడు.అయినా ప్రభువుపై ఆయనకు అపారమైన ప్రేమ. ఆయనను నిత్యం అనుసరించాలని తపన ఆయనను ఆ చిక్కకులా నుండి తెప్పిస్తుంటాయి.రక్షణ పొందాలంటే మీరు తప్పనిసరిగా 'నా శరీరాన్ని భుజించాలి.నా రక్తాన్ని పానం చేయాలి' అని పలికినపుడు అందరు ఆయనను విడిచి వెళ్లిపోయారు.ఒక్క పన్నిద్దరు శిష్యులు తప్ప.మీరు కూడా వెళ్ళిపోతారా? అను యేసు అడగగానే పేతురు 'ప్రభూ! మేము ఎవరి వద్దకు వెళ్ళెదము? మేము విశ్వసించితిమి' అని పలికాడు. ఆ విధంగా ఆయననే అంటి పెట్టుకొని ఆయన అడుగుజాడలలో నడిచిన పేతురు శ్రీసభ ప్రథమ పోపుగారుగా నిలిచాడు. సంఘాన్ని విశ్వాస పథాన నడిపాడు.నన్ను అనుసరించేవాడు నా కన్నా గొప్ప కార్యాలు చేస్తాడు.అని పలికిన మాటలను నిజం చేస్తూ పక్షవాతరోగికి స్వస్థత, మరణించిన జోర్కాను జీవంతో లేపగలిగాడు.సంపూర్తిగా యేసునే అంటిపెట్టుకొని ఉంటే దేవుడు మన మధ్య కూడా గొప్ప కార్యాలు చేస్తాడు.
