న్యాయం, గౌరవం కోసం మనిషి హృదయం ఆకలితో ఉంది - పోప్
జోసెఫ్ అవినాష్
23 Apr 2026
అపోస్తలిక పర్యటనలో భాగంగా మోంగోమోలో జరిగిన పవిత్ర బలిపూజలో విశ్వ కాపరి పోప్ లియో XIV మనిషి హృదయంలో ఉన్న అసలైన తపన గురించి మాట్లాడారు. మనుషులు కేవలం ఆర్థిక అభివృద్ధి కోసం కాదు, న్యాయం, గౌరవం, ప్రేమతో కూడిన జీవితం కోసం ఆకలితో ఉన్నారని ఆయన చెప్పారు.దేవుడు ఒక దేశానికి సంపదలను ఇచ్చినప్పుడు,అవి కొద్దిమందికే పరిమితం కాకుండా అందరికీ మేలు చేసేలా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.నిజమైన అభివృద్ధి అంటే డబ్బు పెరగడం కాదు,ప్రతి మనిషి గౌరవంగా జీవించగలగడం.ప్రజలు తమ భవిష్యత్తును ఇతరులపై వదిలేయకుండా,తామే బాధ్యత తీసుకుని నిర్మించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.సమాజంలో ఉన్న అసమానతలను తగ్గించి, అందరూ కలిసి ఎదగడం ముఖ్యం అని చెప్పారు.కష్టాలు ఉన్నా ఆశను వదలకూడదని, దేవునిపై విశ్వాసంతో ముందుకు సాగితే మంచి మార్పు సాధ్యమవుతుందని ఆయన ధైర్యం ఇచ్చారు.
