పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు

జోసెఫ్ అవినాష్

21 Apr 2026

ఏప్రిల్ 18న గోవాలో పునీత ఫ్రాన్సిస్ శౌరి గురించి ఒక వ్యక్తి చేసిన అవమానకర వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు వెలుగులోకి రాగానే కతోలిక క్రైస్తవ సమాజంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.భక్తుల విశ్వాసాలను దెబ్బతీసేలా మాట్లాడారని ఆరోపిస్తూ,సంబంధిత వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదులు సమర్పించారు.ఈ ఘటనపై రాజకీయ నాయకులు,సామాజిక సంస్థలు కూడా స్పందించి, మతపరమైన గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని పేర్కొన్నారు.ఇటువంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు సమాజంలో అనవసర ఉద్రిక్తతలకు దారితీస్తాయని, మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.గోవాకు ఆధ్యాత్మిక చిహ్నంగా నిలిచిన ఈ పునీతుడి పై వచ్చిన వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామం మరోసారి మాటలపై నియంత్రణ,పరస్పర గౌరవం ఎంత అవసరమో గుర్తు చేస్తోంది. అనుచిత వ్యాఖ్యలను చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు ఫైల్ చేసి విచారిస్తున్నారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN