స్వర్గీయ పోప్ ఫ్రాన్సిస్ గారికి నివాళులర్పిస్తూ

ఫాదర్ చల్ల డేవిడ్ (భారతమిత్రం, ప్రధాన సంపాదకులు)
21 Apr 2026
ప్రజల హోప్ -ఫ్రాన్సిస్ పోప్
పరలోక రోప్- ఫ్రాన్సిస్ పోప్
ప్రపంచపు ప్రభు సేవకుడు-
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోప్
యుద్ధాలు వద్దన్న
ప్రపంచ శాంతి మిన్నన్న
పోప్ ఫ్రాన్సిస్సన్న
ఉత్తాన క్రీస్తు మహిమ
కాగడాను
ఇహం నుండి పరంకు
తీసుకొని బయలుదేరిన
బహుజనుల పోప్ ఫ్రాన్సిస్
దీనజనప్రియుడు పోప్ ఫ్రాన్సిస్
పర్యావరణహితుడు-
జంతు ప్రేమికుడు పోప్ ఫ్రాన్సిస్
వృద్ధుల పాలిట ఆదరణీయం
పోప్ ఫ్రాన్సిస్
అతి ఆడంబరాలు
అసలు వద్దన్న
నిరాడంబర యేసుని
నిజ సేవకుడు పోప్ ఫ్రాన్సిస్
పేదరికం బ్రహ్మచర్యం
విధేయతను సంపూర్ణముగా
జీవించిన పోప్ ఫ్రాన్సిస్
నిధి కన్నా దేవుని
సన్నిధి మిన్న
అన్న గొప్ప ధన్య
జీవి పోప్ ఫ్రాన్సిస్.
