“విభేదాలనుంచి ఐక్యత వైపు: పోప్ పిలుపు”
జోసెఫ్ అవినాష్
20 Apr 2026
విశ్వ కాపరి పోప్ లియో XIV తన అపోస్తలిక పర్యటనలో భాగంగా అల్జీరియాలో పర్యటిస్తున్న విషయం విధితమే.కిలాంబాలో ఆదివారం జరిగిన పవిత్ర పూజాబలిలో పోప్ విశ్వాసులకు ఒక ఆశాజనక సందేశం ఇచ్చారు.జీవితంలో బాధలు,నిరాశలు వచ్చినప్పుడు దేవుడు దూరంగా ఉన్నట్టు అనిపించినా,నిజానికి ఆయన మన పక్కనే నడుస్తూనే ఉంటాడని గుర్తుచేశారు.ఎమ్మావుకు వెళ్తున్న శిష్యులలాగే మనమూ కొన్నిసార్లు నిరాశలో కళ్లుమూసుకుని ఉంటాం, కానీ క్రీస్తు మనతోనే ఉంటాడు.ఆంగోలా దేశం గతంలో ఎదుర్కొన్న గాయాలు,విభేదాలు ఇంకా మిగిలి ఉన్నప్పటికీ,వాటిలోనే ఆశ విత్తనం దాగి ఉందని చెప్పారు. పాత కక్షలు వదిలి,శాంతి మరియు ఐక్యత దారిలో నడవాలని ప్రజలను పిలిచారు.పవిత్ర బలిపూజలో మనలో చనిపోయిన ఆశను మళ్లీ వెలిగించే దేవుని వరమని చెబుతూ,భయపడకుండా కొత్త భవిష్యత్తును నిర్మించమని ధైర్యం నింపారు.
