ఫ్రాన్సిస్కన్ సేవలకు కీర్తి: పలమనేరులో నూతన దేవాలయ ఆవిష్కరణ

ఆనంద్ బెన్
20 Apr 2026
పలమనేరులో ఏప్రిల్ 19న నూతనంగా నిర్మించిన సెయింట్ లూయిస్ దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ ప్రార్థనా కార్యక్రమానికి కడప పీఠాధిపతి మహా ఘన.రెవ. డా. పాల్ ప్రకాష్ సగినాల,ఖమ్మం పీఠాధిపతి మహా ఘన.రెవ. డా. ప్రకాష్ సగిలి,ఫాదర్ జేవియర్ దురై OFM(OFM ప్రావిన్షియల్) దివ్యబలిపూజను నిర్వహించారు.వారితో పాటు పాత దేవాలయ చివరి విచారణ గురువు మరియు నూతన దేవాలయానికి మొదటి విచారణ గురువు అయిన ఫాదర్ జయపాల్ OFM మరియు కమ్యూనిటీ సుపీరియర్ ఫాదర్ స్లీవ రెడ్డి OFM లతో కలిసి ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించగా,వేలాది మంది విశ్వాసులు, కన్యా స్త్రీలు మరియు గురువులు హాజరయ్యారు.
తమ ప్రసంగంలో కడప పీఠాధిపతులు మహా ఘన సగినాల పాల్ ప్రకాశ్ గారు కడప పీఠానికి పలమనేరు విచారణ మరియు ఫ్రాన్సిస్కన్ ఫాదర్లు చేసిన సేవలను ప్రశంసించారు. ఖమ్మం పీఠాధిపతి సగిలి ప్రకాశ్ గారు,పలమనేరులోని సెయింట్ లూయిస్ విచారణ మరియు సెయింట్ లూయిస్ ఫ్రైయరీతో తమకున్న అనుబంధానికి సంబంధించిన మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.రాబోయే 15 ఏళ్లలో ఈ విచారణ నుండి కనీసం ఒక ఫ్రాన్సిస్కన్ గురువును చూడాలని ఆయన ఆకాంక్షించారు.
