రేయి గడువకుండ రేపు రాదు!.

డా. కల్లూరి ఆనందరావు
19 Apr 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.......................................................
ఓపిక వొక బలము! ఓటమి నోడించు!
వేచియున్న చాలు! యిచ్చు ఫలము!.
ఆత్రపడిన చిల్లుపాత్ర నిండుట కల్ల!
రేయి గడువకుండ రేపు రాదు!.
