దేవుని పేరుతో విభేదాలు వద్దు: పోప్
జోసెఫ్ అవినాష్
17 Apr 2026
విశ్వ కాపరి పోప్ లియో కామెరూన్ రాజధాని యౌండే లో ముస్లిం మత నాయకులు మరియు కతోలిక పీఠాధిపతులతో సమావేశమై,మతాల మధ్య ఐక్యత,పరస్పర గౌరవం,శాంతి అనేవి సమాజానికి అత్యంత అవసరమని స్పష్టం చేశారు.దేవుని పేరుతో విభేదాలు, హింసలు సృష్టించడం మానవత్వానికి విరుద్ధమని ఆయన హెచ్చరించారు.క్రైస్తవులు మరియు ముస్లింలు కలిసి సోదరభావంతో జీవిస్తూ,సమాజంలో శాంతి మరియు ప్రేమను పెంపొందించేందుకు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.నిజమైన విశ్వాసం మనుషులను విడదీయదు,కలుపుతుంది అనే గొప్ప సందేశాన్ని ఈ సమావేశం ద్వారా ప్రపంచానికి తెలియజేశారు.
