ఈ ప్రపంచంలో ఎవరూ అనాథలు కాదు - పోప్

జోసెఫ్ అవినాష్

16 Apr 2026

అపోస్తలిక పర్యటనలో భాగంగా విశ్వ కాపరి పోప్ లియో XIV ఆఫ్రికాలో పర్యటిస్తున్న విషయం విధితమే.కెమరూన్‌లోని ఒక అనాథాశ్రమాన్ని సందర్శించిన పోప్ అక్కడి పిల్లల మనసుల్లో ఆశ నింపేలా మాట్లాడారు.జీవితం ఎంత కఠినంగా మారినా, “మనలను ఎవరూ పట్టించుకోవడం లేదు” అనే భావన నిజం కాదని ఆయన స్పష్టంగా చెప్పారు.దేవుడు ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటాడు.మన గాయాలకన్నా,మన భవిష్యత్తు గొప్పదని ఆయన గుర్తుచేశారు.మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది కాదు,మనం ఎక్కడికి వెళ్లాలి అన్నదే ముఖ్యమని పిల్లలకు ధైర్యం ఇచ్చారు.ఈ అనాథాశ్రమం వారికి కేవలం ఓ ఆశ్రయం కాదు ప్రేమతో నిండిన కుటుంబమని ఆయన చెప్పారు.అక్కడ సేవ చేస్తున్న వాళ్లు, దేవుని కరుణను తమ చేతల ద్వారా చూపిస్తున్నారని అభినందించారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN