ట్రంప్ అంటే నాకేమీ భయం లేదు.. పోప్ లియో సంచలన వ్యాఖ్యలు

జోసెఫ్ అవినాష్

15 Apr 2026

వైట్ హౌస్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల మధ్య విశ్వ కాపరి పోప్ లియో XIV అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అంటే తనకు భయం లేదని,యుద్ధానికి వ్యతిరేకంగా గళం విప్పడం కొనసాగిస్తానని పోప్ స్పష్టం చేశారు.ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను అన్యాయం,క్రూరమైనవిగా అభివర్ణించారు.ఏ మత సిద్ధాంతం కూడా యుద్ధాన్ని సమర్థించదని ఆయన స్పష్టం చేశారు.ట్రంప్ ఎన్ని విమర్శలు చేసినా, శాంతి కోసం తన గళాన్ని వినిపిస్తూనే ఉంటానని పోప్ లియో చెప్పారు.10 రోజుల ఆఫ్రికా పర్యటన ప్రారంభంలో భాగంగా అల్జీర్స్క వెళ్తున్న పోప్ విమానంలో రాయిటర్స్తో మాట్లాడారు.అయితే తాను ట్రంప్ నేరుగా ఘర్షణకు దిగబోనని,కానీ మత బోధనలను దుర్వినియోగం చేయవద్దని లియో హెచ్చరించారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN