ప్రార్థన మన జీవనానికి శ్వాస వంటిది - పోప్

జోసెఫ్ అవినాష్

14 Apr 2026

విశ్వ కాపరి పోప్ లియో XIV తన అపోస్తలిక పర్యటనలో భాగంగా అల్జీరియాలో పర్యటిస్తున్న విషయం విధితమే.అల్జీరియాలోని క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ,క్రైస్తవుల జీవితం ప్రార్థన,దయ,సేవ,ఐక్యత అనే మూడు మూల స్తంభాలపై నిలబడాలని సూచించారు. చిన్న సంఖ్యలో ఉన్నా,అక్కడి విశ్వాసులు శాంతి,సోదరభావానికి ప్రతీకగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రార్థన మన హృదయాన్ని పవిత్రం చేసి, మనుషులను దగ్గర చేస్తుందని,అది జీవానికి శ్వాస లాంటిదని చెప్పారు.అలాగే సేవ అంటే కేవలం ఆర్థిక సహాయం కాదు; అది ప్రేమతో,కరుణతో ఇతరులను ఎత్తి నిలబెట్టే అవకాశం అని చెప్పారు.ముఖ్యంగా బలహీనుల సేవలో పాల్గొనడం ద్వారా దేవుని కృపను అనుభవించవచ్చని వివరించారు.చివరగా,క్రైస్తవులు మరియు ముస్లింల మధ్య ఐక్యత,సహజీవనం పెరగాలని,అదే నిజమైన సాక్ష్యం అని గుర్తుచేశారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN