దివ్యబలిపూజ క్రైస్తవ జీవితానికి ప్రాణం వంటిది - పోప్

జోసెఫ్ అవినాష్

12 Apr 2026

పస్కా 2వ ఆదివారం సందర్భంగా జగద్గురువులు పోప్ లియో XIV పునీత పేతురు మహాదేవాలయ ఆవరణలో గుమ్మి కూడిన విశ్వాసులతో సువిశేష సందేశాన్ని పంచుకున్నారు.ఆయన మాట్లాడుతూ,క్రైస్తవుల జీవితంలో దివ్యబలిపూజ ఎంతో ప్రాముఖ్యమైనది.విశ్వాసం సహజంగా నిలబడదు;దాన్ని ప్రతి వారం దేవుని సన్నిధిలో పోషించుకోవాలి అని ఆయన చెప్పారు.అందుకే చర్చి ఆదివారం రోజున విశ్వాసులను ఒక్కచోట చేర్చి,దేవుని వాక్యాన్ని వినిపించి, ప్రార్థనలో ఏకత కల్పించి,యేసుక్రీస్తు శరీర రక్తముల ద్వారా ఆత్మీయ బలం అందిస్తుంది.ప్రారంభ క్రైస్తవులు కూడా “ఆదివారం బలి లేకుండా మేము జీవించలేము” అని చెప్పినట్లు, దివ్య సత్ప్రసాదం క్రైస్తవ జీవితానికి ప్రాణం వంటిది.ఈ దివ్యబలిపూజ మన విశ్వాసాన్ని బలపరచడమే కాకుండా,మనలను ప్రేమ,శాంతి సందేశకులుగా ప్రపంచంలోకి పంపిస్తుందని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN