క్రీస్తు దివ్య కారుణ్యం_మహోన్నతమైన కారుణ్యం

డాక్టర్ అలమండ జోజప్ప

11 Apr 2026

ప్రభువు ప్రేమ కన్నా ఆయన కారుణ్యం మిన్న. ఆయన ప్రేమ గొప్పది, కరుణ గొప్పది, దివ్య కారుణ్యం ఎంతో గొప్పది. ప్రభువు మనిషిని తన సొంత పోలికగా సృష్టించి ప్రేమించాడు. సైతానికి, ఈ లోకానికి బానిస గా ఉండకుండా తన దగ్గరే నిత్య నివాసంలో ఉండాలని తపన అమోఘం. మానవుల పట్ల తనకున్న ప్రేమ, మమకారం మహా గొప్పది. ఆదాము అవ్వలు పాపం చేసినందువలన మరణము రావాలి. బదులుగా ఏదోను తోటలో మొట్టమొదటి రక్షణ సువార్తను ప్రకటించి సిలువ శ్రమల ద్వారా వారి పాపములు తమ భుజముపై వేసుకుని హీనాతి ఏనమగా మరణించి నిత్య జీవమును ప్రసాదించాడు. తద్వారా మానవులను స్వర్గలోక వాసులుగా అనుగ్రహించాడు. అందుకే (రోమ3:23) మన పవిత్రత వలన గాక క్రీస్తు కృప వలన మనము నీతిమంతులుగా ఎంచబడితిమి.అన్ని జన్మలకంటే మనలను ఆయన మిక్కిటముగా ప్రేమించు నందు వలన ఆయన తన స్వాజనులుగా ఏర్పాటు చేసుకొనెను. (ద్వితీయో 7:6)
క్రీస్తు ప్రభువు పవిత్ర హృదయంను 1670 ఫ్రాన్స్ దేశంలో ఆరాధించే ఆచారము మొదలయింది. ఈ భక్తిని 9వ భక్తనాథ పాపుగారు 1856 సంవత్సరము నుండి ప్రపంచమంతటా విస్తరింప చేశారు. ఈ విశ్వాస సాంప్రదాయము మరి ముఖ్యంగా ఆధునిక కాలంలో అతి లోతుగా అర్థము చేసుకొని విస్తరించుటకు 1930 సంవత్సరములో సిస్టర్ పౌష్టినా అమ్మగారికి అనేకమార్లు క్రీస్తు దర్శనమిచ్చి క్రింది విధముగా పలికాడు. నా తండ్రి ఎంత ఘోర పాపినైన క్షమిస్తాడు. ప్రతిపాపిని మన్నించుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ప్రేమతో నిన్ను కనికరించును. నిన్ను రక్షించుటకు నా అద్వితీయ కుమారున్నీ మరణ ము నాకు గురిచేసి తన పవిత్ర రక్తము ద్వారా ప్రపంచ మానవాళిని రక్షించుటకు ప్రణాళిక సిద్ధము చేసుకొనెను.

మానవుల పట్ల తనకున్న అమితమైన ప్రేమను బట్టి తన వైభవోపేతమైన విడిచి మనలో ఒక మానవుని వలె మారిపోయాడు. వారిని ఈజిప్ట్ నుండి కానానకు అరణ్య ప్రయాణంలో పయనించినప్పుడు దీప స్తంభముగా, అగ్నిస్తంభముగా మారాడు. బండగా మారి నీటిని ప్రసాదించాడు. మన్న గా మారి ఆహారాన్ని ఇచ్చాడు. నోవా కాలములో వాడగా మారి ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు. తన పవిత్ర హృదయము ద్వారా రక్తము జీవజలములను ఇచ్చి బాప్తిస్మము, దివ్య భోజనం లను ప్రసాదించి మానవులలో నిత్యము నివసించుటకు రొట్టిగా మారాడు. ఈ విధముగా ఎన్ని విధాలుగా తగ్గించుకోవాలో తగ్గించుకొని తన పిచ్చి ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. కానీ మానవుడు లోకాశల పట్ల, సైతాను శోధనలకు, ఆకర్షణలకు ఆకర్షితుడై పాపము కట్టుకొనుచున్నాడు. నాడు శిష్యులు పై పవిత్రాత్మను ఊది మీరు ఎవరి పాపములను మన్నించెదరో అవి పరలోకమందును మన్నించబడును అని పాప మన్నింపు అధికారమును ఇచ్చెను. నేడు అభిషిక్తులైన గురువులు పాప మన్నింపును లోకాంతము వరకు ఇస్తూనే ఉందురు.

ఈ దివ్యకారుణ్య భక్తిని ప్రపంచ మహోత్సవముగా 2వ జాన్ పాల్ పాపు గారు 2000లో స్థాపించారు. పాస్కా పండగ తర్వాత వచ్చు 2వ ఆదివారం నాడు క్రైస్తవ సంఘము మహోత్సవముగా కొనియాడుచున్నది. క్రీస్తు ప్రేమ గా క్షమించు నది, పాపుల పట్ల కారుణ్యము చూపినది, క్రీస్తునాధుని దృఢముగా నమ్ముట అనే సత్యాలను బోధించుచున్నది.20వ శతాబ్దంలో సంభవించు ప్రపంచ యుద్ధాలు అనేకులు దారుణముగా చనిపోయారు. నాస్తిక వాదం ప్రబలింది. ప్రపంచమంతా నిరాశ నిస్పృహ నాతో నిండి ఉన్నది. అట్టి పరిస్థితులలో దివ్య కారుణ్యం సమూలనమైన క్షమా, పాపుల రక్షణ కొరకు నిరీక్షణ, తుది తీర్పునకు విశ్వాసముతో నిరీక్షించుట, క్రీస్తు ప్రభువు రెండవ రాకడ కొరకు సిద్ధపడుట నిమిత్తము ప్రభు ని కరుణాకటాక్షములు అవసరములై ఉన్నవి.

దేవుని కరుణ వెలకట్టలేనిది. మన పాప పు బ్రతుకుల వలన మరణించవలసి వచ్చినను తన కృపతో మనలను జీవంప చేస్తూ ఉన్నాడు. యావే కనికరము, దయ, దీర్ఘ శాంతం, కృపా సత్యములు కలవాడు. ఆయన వేలాదిమంది అపరాధములను 4 తరాల వరకు మన్నించును (నిర్గమ 34:6_7). 50 దయాదాక్షిణ్యపూర్ణుడు. కృప సమృద్ధిగా గలవాడు. ఎప్పుడు కోపించడు. భూమికంటే ఆకా by gvశం ఎంత ఉన్నతమో ఆయన యందు భయభక్తులు గలవారికి ఆయన కృప అంత అధికముగా ఉన్నది (కీర్తన 103:8-12). యావే వాత్సల్యము ఎడతెగక ఉండును. మనము వినాశనము చెనుదం(విలాప 3:22-23). ఆయన కనికరము చూపుటేయందు సంతోషించువాడు. కనుక ఆయన కోపం నిరంతరము ఉండదు (మీకా 7:18). దుష్టులు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడి బహుగా క్షమించును (యే ష య 55:7).
క్రీస్తు కరుణ సంపన్నుడు. మన అపరాధిముల వలన చావవలసి ఉన్నది. కానీ ఆయన మహా ప్రేమ చేత మనము బ్రతుకుచున్నాము, ఆయన కృప చేత రక్షించబడియున్నాము (ఎఫేసి 2:4-5). మన నీతి వలన గానీ, క్రియల వలన గాని కాక కేవలం పవిత్ర ఆత్మ నూతన పరచుట ద్వారా మనము రక్షంప బడితిమి (తీతు 3:5). మనము కనికరించబడి సమయోచిత సహాయము కొరకు కృపానుందితిమీ. క్రీస్తు దయను నమ్ముట వలన ధైర్యముగా తండ్రి దగ్గరకు వెళ్లే కృపకు పాత్రుల మగుదుము (హెబ్రీ 4:16). దారి తప్పిన కుమారుని కొరకు పరుగిడిన తండ్రి కనికరమును మనము పరిశుద్ధ గ్రంథములో క్రీస్తు ప్రేమను క్షమాగుణమును చూడగలము.99 మంచి గొర్రెలను విడిచి తప్పిపోయిన గొర్రెల నిమిత్తము తపించిన దయామయుడుని చూడగలము. పోగొట్టుకున్న నాణెము దొరికితే మహా సంతోషపడిన కారుణ్య మూర్తిని చూడగలము
(లూకా 15:11-22).

ప్రభు మన పాపములను ఘనించువాడు కాదు. తిరిగి విరిగి నలిగిన హృదయముతో ఆయన దగ్గరకు వచ్చి నా రక్షక, విమోచకడ నన్ను మన్నించు అని మీ పాపములను ఒప్పుకుంటే నిన్ను విని వెంటనే హత్తుకునే రక్షకుడు మనకు తన కారుణ్యమును ప్రసాదిస్తాడు. ఈ భాగ్యము ఏ మతంలోనూ ఏ దేవుడిలోనూ ఉండదు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN