పలుకుకు ఫలితమ్ము కలుగు సుమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
10 Apr 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.........................................................
ఎదుటి వారి మాట యేమాత్రము వినక
తిరిగి బదులు పల్క తెలివి యౌన?
వినుట గొప్ప విద్య!వినినంత బదులీయ
పలుకుకు ఫలితమ్ము కలుగు సుమ్ము!.
