క్రీడాస్ఫూర్తి, శాంతికి పిలుపు - పోప్

జోసెఫ్ అవినాష్

10 Apr 2026

మిలాన్–కోర్టినా 2026 శీతాకాల ఒలింపిక్, పారాలింపిక్ క్రీడాకారులను కలిసిన సందర్భంగా, విశ్వ కాపరి పోప్ లియో XIV క్రీడ రంగం కేవలం రికార్డులు, విజయాలు సాధించే రంగం మాత్రమే కాదని, మనిషి విలువలను పెంపొందించే ‘జీవిత పాఠశాల’ అని ఆయన అన్నారు.నిజమైన క్రీడలో మనస్తత్వం, క్రమశిక్షణ, వినయం, పరస్పర గౌరవం ముఖ్యమని, వాటిని వదిలి ప్రదర్శన, ఖ్యాతి, మార్కెట్ ప్రభావం కోసం క్రీడను వినిపించకూడదని పిలుపునిచ్చారు. ఒలింపిక్ ట్రూస్ అనే ప్రాచీన శాంతి సంప్రదాయాన్ని గుర్తుచేసి, ఈ కాలంలో కూడా క్రీడలు ప్రజలను దగ్గర చేసి శాంతిని నిర్మించే శక్తి కలిగి ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా పారాలింపిక్ క్రీడాకారుల ధైర్యం, పరిమితులను అవకాశాలుగా మార్చే వారి మానసిక బలం అందరికీ స్ఫూర్తి అని ఆయన అభినందించారు. గెలిచినా, ఓడినా—మానవ గౌరవం, క్రీడాస్ఫూర్తి నిలవాలని పోప్ సందేశం ఇచ్చారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN