క్రీస్తు ఉపమానాల పరమార్థం

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్

09 Apr 2026

ప్రశ్న -
యేసుక్రీస్తు ఉపమానాలతో బోధించడానికి కారణమేమిటి? అసలు 'ఉపమానము' అంటే అర్ధమేమిటి?

సమాధానం-
ఆంగ్లపదమైన Parable కు తెలుగులో అర్ధం "ఉపమానం" అని చెప్పబడింది.Parable అనే పదం గ్రీకు పదమైన Parabole అనే పదం నుండి వచ్చింది. దానికి అర్ధం ఇలా చెప్పుకోవచ్చు.

Para = along side = ప్రక్కగా
bole = to cast (alongside) = వేయబడినది.

పై చెప్పిన పదాలననుసరించి, ఉపమానం అంటే ఒక విషయానికి అనుగుణంగా లేక ప్రక్కప్రక్కగా ఇంకోకథను వివరిస్తూ, ప్రేక్షకులు అవగాహన చేసికొనడానికి, సులభతరం చేయడం. ఫలితంగా క్రొత్త విషయాన్ని, తెలిసిన విషయం ద్వారా బోధించినట్లవుతుంది. వినేవారు సులభంగా అర్ధంచేసికొనడానికి ఈ పద్ధతిని అవలంబిస్తారు. ఉపమానం అనే పదం, సువిశేషాలలో 48 మార్లు, హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో 2 మార్లు ఉపయోగించబడింది. ఇక్కడ తప్ప మరెక్కడా ఈ పదం కనుపించదు.

ఉపమానాలు,చెప్పే విషయాన్ని కథారూపంలో నడిపిస్తూ, ప్రేక్షకుల అవగాహనను సులభతరం చేస్తాయి.వీటిని ఆధ్యాత్మిక, నైతిక ధర్మాలను,సత్యాలను బోధించటానికి ఉపయోగించేవారు.సామాన్య శ్రోతలకు తెలిసిన విషయాలనుండే ఉపమానం తీసుకొనబడుతుంది. అక్కడనుండి తెలియని విషయాన్ని వివరించడం జరుగుతుంది.ఈ విధంగా శ్రోత, తాను వినే సత్యాన్ని తానే తెలుసుకుంటాడు.మొదటి శతాబ్దంలో రబ్బీలు ఈ విధమైన ప్రక్రియనే ఉపయోగించేవారు.ప్రవక్త నాతాను దావీదుకు వివరించిన ఉపమానం ఈ కోవలోకే వస్తుంది. (దావీదు ఊరియా - బెత్షెబ వృత్తాంతం - 2 సమూ 12:1-15)

యేసుక్రీస్తు కూడా ఇదే పద్ధతిని అవలంభించాడు.ఆయన శ్రోతలలో దాదాపు అందరూ సామాన్య ప్రజలే,రోజూ కాయకష్టం చేసుకొని బ్రతికే వారే.వారికి దైవవాక్యం వినిపించి,సులభంగా అర్ధమయ్యే రీతిలో చెప్పాలంటే ఉపమానాల ద్వారానే అది సాధ్యమయింది.అది వారిలో ఆసక్తిని,కొనసాగింపును రేకెత్తించింది.ఆయన బోధనలు వినడానికి ప్రజలు తండోప తండాలుగా వచ్చేవారు అంటుంది సువిశేషం. సువిశేషాలలో దాదాపు 40 ఉపమానాలు చెప్పబడినట్లు తెలుస్తోంది (మత్తయి 7:24-27, 5:13-15, 9:14-27, 20:42-47, 6:32-35).అవన్నీ జనరంజకంగా ఉన్నాయి. కాబట్టే ఈనాటికీ సజీవంగా ఆయన వాక్యానికి సాక్షమిస్తున్నాయి.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN