పవిత్రత కలిగి జీవిద్దాం - పోప్
జోసెఫ్ అవినాష్
08 Apr 2026
విశ్వ కాపరి పాప్ లియో XIV తన సాధారణ అపోస్తలిక సందేశంలో Lumen gentium పత్రంపై తన బోధనలను కొనసాగిస్తూ,పవిత్రత్వం అనేది కొద్దిమంది ‘అత్యంత ఆధ్యాత్మిక’ వ్యక్తులకు మాత్రమే ఇచ్చే వరం కాదని, జ్ఞానస్నాన సంస్కారం స్వీకరించిన ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చిన సాధారణ పిలుపు అని చెప్పారు.పవిత్రత్వం అంటే పెద్ద పెద్ద కార్యాలు చేయడం కాదు; ప్రతిరోజూ దేవుని కృపకు ప్రతిస్పందిస్తూ ప్రేమ,వినయం,సేవ మనసుతో జీవించడం.క్రైస్తవ జీవితం అనేది దేవుని ప్రేమను మనలో పొందుకుని,ఆ ప్రేమను మాటల్లోనే కాదు.మన ప్రవర్తనలో, నిర్ణయాల్లో,ఇతరుల పట్ల చూపే మంచితనంలో వెల్లడించే పథం అని ఆయన గుర్తుచేశారు.ప్రతీ క్రైస్తవుడు తన స్వంత జీవిత పరిస్థితుల్లోనే దేవుని ప్రేమను ప్రతిబింబిస్తూ పవిత్రత్వంలో ఎదగవచ్చని పాప్ పేర్కొన్నారు.
