పునరుత్తాన క్రీస్తుని వెంబడిద్దాం

బ్రదర్ టోనీ నాగిపోగు MSC

07 Apr 2026

పాస్కా మొదటి బుధవారము, 08-04-2026,
మొదటి పఠనము : అపొస్తుల : 3:1-10
సువిశేష పఠనము : లూకా 24:13-36
ప్రియులారా ఈ లోకములో మనము కలిగివుండవలసినది అత్యంత ముఖ్యమయినా కరీదైన, విలువగల బహుమతి ఏదైనా వుంది అంటే అది యేసయ్యను కలిగివుండటం. అందుకే ఆంగ్లములో ఈ విధముగా అంటారు. With Jesus I am hero, without Jesus I am zero అని,
అపో 3:6....అప్పుడు పేతురు నా దగ్గర వెండి, బంగారము ఏమియు లేదు. నిజరేయుడగు యేసు క్రీస్తు పేరిట నీవు నదువుము అని పలికెను. యేసయ్య నామములో శక్తి వుంది, విశ్వాసం ద్వారా అద్భుతాలను పొందగలము, దేవుడు నిరాదారుల జీవితాలను మార్చగలడు, అపొస్తుల సేవా ద్వారా దేవుని మహిమ ప్రజలకు వెళ్లడవుతుంది, ఇది చాలా ముఖ్యమైన ఘట్టం ప్రియా సహోదరి సహోదరులారా... ఆయన నామమును బట్టి అక్కడ స్వస్థతను చేకూర్చాడు. పేతురు గారి దగ్గర ఏమి లేకపోయినా, ఒక్కటి మాత్రము ఆయన దగ్గర ఉందని గ్రహించిన పేతురు గారు, సర్వమే క్రీస్తని బావించిన వీరు, ఆయన నామములో గొప్ప కార్యము చేశారు.

పేతురు గారు బొంకాడు కానీ బలమైన విశ్వాసి అయ్యాడు.... ఇక్కడ బొంకకుండా, ఆయన మహిమను కనపరచ్చాడు, ఆయనే గొప్పదేవుడని ప్రజలకు అర్తం అయ్యేలా తెలియజేసాడు, యేసయ్యలో ఏవైనా సాధ్యం కాగలవు అని నిరూపించాడు. ఈయనే ఆయన అని వెలుగేతి అందరిని ఆశ్చర్యానికి గురిచేసాడు. పేతురు గారి విశ్వాసం పెరిగింది, ఆయన ప్రేమ యేసయ్య పై పెరిగింది, ఆయన పరిచర్య యేసయ్య పై అమితామై పోయింది. నమ్మకం లేని వారిని నమ్మకస్టులుగా చేసాడు, అన్నియు ఆయనలో సమకూర్చబడును అని తేటతేల్లం చేసాడు. ఆయన సర్వంతర్యామి, omnipotent, and omnipresent అని ఆ మార్గములో నిరాశతో వున్నా వారిని ఆశతో నింపాడు. వారి ఇద్దరి ఆశ క్రీస్తే అని, ఆయన లేచాడని, ఆయన పునరుతానుడని, చింతపడకని, దిగులు వద్దని, దారిపోదవున ఆశ వున్నా గుర్తించకపోయినా చివరిగా క్రీస్తే వారి తో ప్రయాణించింది అని కనువిప్పు కలిగేలా వారిలో వున్నా బయా ఆలోందలను అంతం చేసాడు మన పునరుతానుడు. వారు మొదటిలో గుర్తించకపోయినా, కనుక్కోలేకపోయినా, కనువిప్పు కాకా పోయిన, ఆయన క్రీస్తే అని విశ్వాసం నిండుగా పొందారు.
కావున ప్రియులారా యేసునామములో శక్తి వుంది, ఆయన నామములు అద్భుతాలు జరుగును, చీకటి వణుకును, భయం బయపడును, అనుమానం అంతం అగును, ఆపణమ్మకం నమ్మకమగును, అసత్యం సత్యమగును, నిరాష ఆశగును, కన్నీరు, సంతోషమగును, భయబ్రాంతులకు దారి ముగియును, ఆయన్లో మహిమ వున్నది, కారుణ్యం వున్నది, యేసునామములో నీవు బయపడకుము, సంతోషం గా ఉండుము, నీవు ఆయనలో ఆహ్లాధముగా ఉండగలవు. సాతాను పారిపోవును, కావున ఎవరు లేరని, ఉండరని, కొరతతో జీవింపక, మనము కూడా యేసయ్య నామములో ఎన్నో గొప్పకార్యాలు చేసేలా, గొప్ప దీవెనగా మారేలా, విశ్వాసముతో ముందుకు వెళ్లేలాగున, మన భక్తిలో ఆయన తోడుగా మరియు సహవాసిగా మన ప్రయాణములలో నీడగా ఆయన మనలో మనతో ప్రయాణం చేయాలనీ, మన జీవితాలలో గొప్ప కార్యలు చేసేలాగునా మనము అందరము ఆశీస్సులు పొందాలని ఆ పునరుతానా క్రీస్తును మనసారా అడుగుదాము.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN