మరణాన్ని జయించిన క్రీస్తు మన ఆశకు మూలం- పోప్
జోసెఫ్ అవినాష్
06 Apr 2026
యేసుక్రీస్తు మృతిలోనుంచి తిరిగి లేచిన సంఘటన మనకు ఎట్టి పరిస్థితుల్లోనైనా నిలబెట్టే ధైర్యాన్ని,భరోసాను ఇచ్చే ఆశను వెలిగిస్తుంది అని విశ్వ కాపరి పోప్ లియో XIV వారు ఈస్టర్ సందేశంలో చెప్పారు.క్రీస్తు మరణాన్ని జయించినందున,ఆయన వెలుగు మన జీవితంలోని చీకట్లను తొలగించి మనకు నూతన శక్తిని ఇస్తుందన్నారు. మన చుట్టూ కనిపించే యుద్ధాలు,అన్యాయాలు,స్వార్థం, అలాగే మనలోని పాపం,భయం,నిరాశలున్నా చివరికి దేవుని ప్రేమే విజయం సాధిస్తుందని ఆయన గుర్తుచేశారు.ఈస్టర్ అంటే చీకటిలో వెలుగు పుట్టిన రోజు;మన దృష్టిని దిగజార్చే సమస్యల నుండి దేవుని ఆశ వైపు మళ్లించే సమయం.పునరుత్థాన క్రీస్తు మనలో ధైర్యాన్ని, కొత్త జీవనాన్ని,ఇతరులను ఆదుకొనే మనసును కలిగిస్తాడని,ఈ ఆనందాన్ని శాంతి, ప్రేమ, దయగా ప్రపంచంలో పంచాలని పోప్ ఆహ్వానించారు.
