యోచనమ్ము తప్పి మోపెడవును!

డా. కల్లూరి ఆనందరావు
05 Apr 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
...........................................
దూర దృష్టి లేక నెరవేఱవు పనులు
యోచనమ్ము తప్పి మోపెడవును!
ముందువెనుకలన్ని మునుముందె ఊహించి
మొదలు పెట్టినపుడె సాధ్యమౌను!
