క్రీస్తు పునరుత్థాన పండుగ ప్రత్యేక వ్యాసం

బ్రదర్ టోనీ నాగిపోగు MSC
04 Apr 2026
మరణం ఆయనను ఓడింపలేకపోయింది. చీకటి ఆయనను బంధింపలేక పోయింది. అంధకారం ఆయనను పట్టుకోలేకపోయింది. క్రీస్తు మరణాన్ని జయించిన మృత్యుంజయుడు. మరణానికి ఏమాత్రం ఆయనపై అధికారం లేదని వెళ్లడయింది. ఆధిపత్యం చీకటికి లేదని రుజువుయ్యింది. ఆయన పునరుతానుడు. కావున ప్రియులారా మన పునరుతానా క్రీస్తు మహోత్సవమును కొనియాడుచుండగా, ఈ గమ్మతును కొంచెం లోతుగా ఆత్మీయ ధ్యానం చేద్దాము.
(1) ఖాళీ సమాధి(Empty tomb)మత్తయి 28:13
మూసినరాయి మూసినట్టే వుంది. కట్టినతాల్లు కట్టినట్టే వున్నాయి. రొమా సైనికులందరు ఆ సమాధి చుట్టూ వున్నారు. కానీ సమాధి ఖాళీ అయ్యింది. శిస్యులు దొంగలించరని అన్నారు, పిరికివారై పరారై పోయిన శిస్యులు ఆపని చేయలేదు, భయబ్రాంతులకు గురైన వారు దొంగలించరంటే అది నమ్మశక్యం కాదు, అమాయకులు భయముతో దాగుకున్నారు. అదేవిధముగా స్త్రీలు వస్త్రాలను తీశారని సిద్ధంతాలు చేప్పుతున్నాయి. అక్కడ అంతమంది ఉంటే ఎవరు లోపలికి వెళ్తారు, no chance,... ఎవరికి అంత దైర్యం కూడా లేదు.. కానీ సమాది ఖాళీ అవ్వటానికి ఒకే ఒక కారణం, ఆయన మృత్యుంజయుడు అయ్యాడు. ఆయన మాట నిజము అయ్యింది. పునరుత్తానం మనకు భాగ్యము అయ్యింది. వస్త్రాలు అక్కడే వున్నాయి, దేవధూతలు అక్కడే వున్నారు.
(2) ప్రవక్తల ప్రవచనాలు నెరవేరటం (Prophesy fulfilment)
మూడువందల ప్రవచనాలు నెరవేరబడాయి. రాయబడాయి, అవన్నీయుకూడా ఆయనలో నెరవేరబడ్డాయి. పూర్వికుల బోధ నేర్వావేరబడింది. పూర్వికుల ప్రవచనాలు ఇక్కడ కనపడాయి. పొల్లుపోకుండా లేకనాలు నెరవేరాయి. క్రీస్తు సజీవ వాక్యం అందరి నోర్లను మూసేలా చేసింది. నిజమైన మెసేయ్య ఈయనే అని చెప్పిన మాటలు, మొదటివాడను, ఆది నుండి ఉన్నావాడను, నేను ఆయనను, ఆయనను నేనే, అని పలికిన బోధ నిజమాయను. అరణ్య యోహాను బోధ సజీవమాయే ఈ పునరుతానా క్రీస్తు ప్రవచనాలలో, ఇదిగో దేవుని గొర్రెపిల్లా అని పలికిన సత్య వాక్కు, ప్రవచనావాక్కు, ఈ పునరుతానా క్రీస్తులో నిజమాయే, సత్యమాయే, మరియు సజీవమాయే.
(3) సువార్త లేకనాలు (Gospel Accounts )
నాలుగు సువార్తలు, మరణం, మరియు పునరుతానం గూర్చి రాశారు. మత్తయి 28, మార్కు16, లూకా 24, యోహాను 20 లు నిజమని లికించారు. వివిధ రచయితలు, వివిధ సంవత్సరాలలలో రాసారు, కానీ ఒకే ఆత్మీయ సజీవ వాకును రాసారు. వీరు నలుగురు ఒకే చోట కూర్చుని రాసిన సువార్తలు కావు ఇవి, నాలుగు సువార్తలు ఆయన పునరుతానం గూర్చి తేటతేల్లం చేసాయి ఆయన మృత్యుంజయుడు అని. లికించిన లేకనాలు అన్నియు ఈ మెసేయా గురించి, ఈయనను మరణం బందించలేకపోయిందని, మృత్యుంజయమూర్తుడు అని, మృతుంజయ కారున్యుడు అని, మృత్యుంజయ పరలోక కారున్యుడు, ఈ క్రీస్తని నాలుగు సువార్తలు తెలుపుతున్నాయి.
(4) చరిత్ర కారుల చరిత్ర పుస్తకాలు (Historical records)
Tacticus, Flavius Josephus, Marabar serqpion, Lucian, Talmud, Clement of rome, Igantius, Polycarp, Barnabas and Justin martyr లు జరిగిందని తమ చరిత్ర గ్రంధాలలో తెలిపారు. వీరు కూడా నిజమేనని ఒకేమాటగా, ఒకే రీతిగా, ఒకే పద్యముగా, ఒకే గేయముగా, ఒకే స్వరముతో, ఆయన లేచాడని, ఆయన పునరుతానం గాంచాడని, ఆయన మృత్యుంజయడని ఎలా చెప్పుతారు. Atleast ఒకరు అయినా అబద్ధం చెప్పాల్సి ఉండాల్సింది కదా, కానీ అందరి నోట ఒకే మాట పునరుతానా మాట, కావున మన ప్రభువు పునరుతానం అయ్యాడు. నీకోసం, నాకోసం, మనందరి కోసం, మరి విశ్వాసిదామా, ఆయనను వెంబడిదామా.
(5) స్త్రీలు (The women)
ప్రత్యక్షముగా చూసింది వీరే. మత్తయి 28:1-8, మార్కు16:1-8, లూకా 24:1-10, యోహాను 20:1-2.స్త్రీలు చూసారు, చూసాక వారి ఆనందానికి అవధులు లేవు. గుండె నిండా ఆనందం, మనస్సు నిండా సంతోషం, తిరిగి లేచాడానే పరమాణంధం. కానీ పునరుతానా భాగ్యులు వీరని ఎవరు గుర్తించలేదు. చూసిన పుణ్యాత్ములని ఎవరు గ్రహించలేకపోయారు. ఆశ్చర్యాపోయారు. ఆ ఆశర్యమును లోకముతో పంచుకున్నారు. ఆ శుభవార్త వారిలోనే ఉంచుకోకుండా ప్రకటించారు. ఆయన లేచాడని, సమాధిలో లేడని, అమరణపు సంకెళ్లు తెగిపోయాయని, అద్భుతకారుదని,, ఆ స్త్రీలు చూసినది, చూసినట్టుగా ప్రకటించారు.
(6) అపొస్తుల సాక్షాలు (The experiences of the Apostles
పిరికివారు బయపడారు. వణికిపోయారు. ఆశను కోల్పోయారు. తమను తాము దాచుకున్నారు. సమాజమాలో తిరగలేకపోయారు. ఇలా వున్న వీరు రాబోయే రోజులలో కాబోయ్యే హతసాక్షులు వీరని, గుర్తించలేక, పోయారు, బయపడుతున్నవీరికి ఆయన కనపడాడు. ప్రత్యక్ష్మయ్యాడు. ఆనందం లో మునిగిపోయారు వారు. వారి సంతోసం పొంగిపోర్లింది. ఈయన యుగయుగాలకు దేవుడని, రాజని, మహోనతుడని, బలముగా విశ్వాసించారు.
(7) ఒకే సమయములో 500+ మందికి పైగా సాక్షాలు
ప్రత్యక్ష సాక్షాలు. 1 కొరింథీ 15:6, లూకా 24:13-35, ప్రజలు చూసారు. ఒకే సమయములో చూసారు. నమ్మని వారు నమ్మారు. ఎంతగానో కీర్తించారు. దైర్యం వచ్చింది, విశ్వాసం పెరిగింది, ఆత్మీ్యత ఎదిగింది. దుఃఖం లేదు, బాధలేదు, ఇతర ఏవియు లెవు. అసమానతలకు గురైనా ఎందరికో ఈ పునరుతానం ఒక గొప్ప విశ్వాసం. దీవెనను పొందారు, ఆశీర్వాదాములను పొందారు. పునరుతానా క్రీస్తును పొందుకున్నారు. నిలుపుకున్నారు. ప్రకటించుకున్నారు, ఆ ప్రకటనను ఇతరులకు అందించారు.
(8) క్లేయోపా మరియు అనుచరులు (Cleopas and companions)
వీరి సాక్షం అమోగం. మనసారా పులకించారు. సంతోశించారు, మనసార కాంక్షించారు. ఆపణమ్మకం నమ్మకమయ్యింది. అల్పా విశ్వాసం విశ్వాసం అయింది. చీకటి తనము, వెలుగుతనం అయ్యింది, అంధకారం అంతమైపోయింది, పాతజీవితం కాలిపోయింది, పాతబావాలు అరగిపోయాయి, పాత ఆలోచనలు పారిపోయాయి. వారివిధానం మారిపోయింది, కొత్తధనం చిగురిస్తుంది, ఎక్కడ చూసినా పునరుతానా మాట, ఏక్కడ నడిచిన అదే సంభాషణ, క్లేయెప ఆయన అనుచరులు విశ్వాసం చాతారు, మారారు, మార్చుకున్నారు, మాదిరిగా నిలిచారు, పునరుతానా మహాశీషులను అందరిపై వెధజాళ్లారు. వారి పునరుతానా అనుభవాలను ఆత్మీయముగా ద్యానిస్తూ ప్రకటించారు.
(9) అపొస్తులుడైన పౌలు
నమ్మని వాడు, హింషకుడు, క్రూరుడు, బాధను పెట్టినవడు. పునరుతానా క్రీస్తు ను చూసి మారాడు. ఈ పునరుతాని మహిమ ద్వారా సౌలు పౌలు గా మారాడు. బోధన అంటే పడేది కాదు, దూషించేవాడు, కష్టపెట్టే వాడు. పునరుతానా క్రీస్టులో మారి, గొప్ప సేవకునిగా మారాడు. బలముగా దీవింపబడారు, పునరుతానా క్రీస్తును ప్రకటించుటకు అంతలా చెత్తగా భావిస్తున్నాను అని ఆత్మీయ పోరాటం చేసాడు. చెరశాలలో లేకలు, సముద్రజాలాలల్లో ప్రయాణలు, ఉమ్మేసిన, నెట్టేసిన, తిట్టేసిన, మరువలేని సేవను చేసిన అపొస్తులుడు మన పౌలు గారు. మరణించుట ఆయనకొరకే అని ఆయన కొరకు జీవించాడు.
(10) యేసుక్రీస్తు వారి సహోదరులు,
వీరు కూడా సాక్షమిచ్చారు. క్రీస్తు లేచాడని, అందరికి తెలియజేప్పటం మొదలు పెటారు. వీరి సాక్షం కూడా ఎంతో విలువైనది. విశ్వాసములో బలపడారు. విశ్వాసమును విశ్వామాంతటికి వ్యాపింపచేయుటలో తమ ప్రాణాలను సహితం అర్పించారు.
చారిత్రక వాస్తవముగా 11 సార్లు పవిత్రగ్రంధములో వ్రాయబడింది. ఆయన లేచాడని, పునరుత్తానుడని, కావున ప్రియులారా ఈ పండుగ పర్వదినమున మనము అందరము పునరుతానా పలాలను, ఆశీర్వాదలను, మనపై కుమ్మరింపబడాలని, మనపై రావాలని విశ్వాసిదాం పునరుతానా క్రీస్తు విశ్వామoతటికి వెలుగై వెలిగించాలని, విశ్వానికి చాటుదాం, ప్రకటిదాం, ఆయన సేవలో నిండు నూరేళ్లు పలించుదాం.
ఉత్తాన క్రీస్తు మనలను దీవించును గాక..
