క్రీస్తు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలతో

ఫాదర్ కన్మూరి అలెగ్జాండర్, నల్లగొండ

04 Apr 2026

తండ్రి నన్ను నడిపించు
మార్గం చీకటిగా ఉంది
నా తండ్రి మేఘాలు మీద
మేఘాలు నా బ్రతుకుపై
గాఢంగా కమ్ముకుంటున్నాయి
గర్జనలు గట్టిగా వినిపిస్తున్నాయి
నేను గందరగోళంలో
ఉన్న వాడిలా నిలుచున్నాను!

ఓ తండ్రి నా చెయ్యి పట్టుకో •••
ఈ చీకటి నుండి సురక్షితంగా
ఇంటికి నడుపు నీ బిడ్డను!
రోజులు వేగంగా గడుస్తున్నాయి
నా తండ్రి!
రాత్రి చీకటి గాఢంగా
పరుచుకుంటుంది.
విశ్వాసం లేని నా చూపు
భయానక దృశ్యాలను చూస్తుంది.
భయాలు సమూహంగా
నన్ను చుట్టుముట్టుతున్నాయి.
ఓ తండ్రి నా చేయి పట్టుకో
ఈ రాత్రిలో నుంచి
వెలుగులోకి నడిపించు నీ బిడ్డను!
మార్గం అగమ్య గోచరంగా ఉంది నా తండ్రి!
నా ఆత్మ ఊరుట కోసం
స్పష్టత కోసం ఆకాంక్షిస్తుంది!
ఈ అలసిపోయే మార్గంలో
ప్రయాణిస్తున్నాను.
నేను తప్పిపోకుండా కాపాడు
నీ చేయి అందించు నీ బిడ్డను!
నేరుగా నీ సిలువ సన్నిధి వరకు
నడిపించు నన్ను
నీ బిడ్డను! దారి కఠినంగా
ఉంది నా తండ్రి!
ఎన్నో పాపపు ముళ్ళు నన్ను
గాయపరుస్తున్నాయి.
నా పాదాలు చీలి నెత్తురోడుతున్నాయి
మార్గం తడుస్తుంది.
అయినా నీ ఆజ్ఞ నన్ను
ముందుకు సాగమని ఆదేశిస్తుంది.
ఓ తండ్రి నా చేయి పట్టుకో
అప్పుడు నా ప్రయాణం
సురక్షితమవుతుంది.
అప్పుడు నీ విశాల మైదానాలలో
నేను సేద తీర్చుకుంటాను.
ఓ నా తండ్రి నేను
నీ బిడ్డను నన్ను నడిపించు!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN