"క్రైస్తవ ఐక్యత కోసం రన్ ఫర్ జీసస్"

ఫాదర్ చల్ల డేవిడ్ (భారతమిత్రం, ప్రధాన సంపాదకులు)
04 Apr 2026
పరుగెత్తి.. ఎలుగెత్తి చాటుదాం.. అంటూ క్రైస్తవ సోదరులు ఏప్రిల్ 4 శనివారం నాడు నగరవ్యాప్తంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు.2026 ఏండ్ల క్రితం శుభ శుక్రవారం నాడు సిలువలో మరణించిన ఏసుక్రీస్తు మరణాన్ని జయించి మూడో రోజు ఆదివారం తెల్లవారుజామున లేచి తనను ప్రేమించిన వారికి, తన శిష్యులకు కనిపించి వారితో మాట్లాడారని క్రైస్తవులు బలంగా విశ్వసిస్తారు.అయితే క్రీస్తు సమాధిని గెలిచి బయటకు వచ్చాడని, ఒకరికి ఒకరు చెప్పుకోవడానికి క్రైస్తవులు సంప్రదాయం ప్రకారం రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు.భారతదేశంలోని 800 ప్రాంతాలలో ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించబడింది.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ మరియు కర్ణాటక రాష్ట్రాల ఎన్నో ప్రాంతాల్లో ఈ రన్ ఫర్ జీసస్ అత్యంత ఉత్సాహంతో జరిగింది.
హైదరాబాద్ అగ్ర పీఠంలో, అగ్ర పీఠాధిపతి కార్డినల్ మహా ఘన. పూల అంతోని తండ్రి గారి ఆధ్వర్యంలో ఫాదర్ మైఖేల్ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఎంతో శ్రద్ధగా ముందుకు నడిపించబడింది. ఈ ర్యాలీలో కతోలిక విశ్వాసులు భారీగా పాల్గొన్నారు. ఇతర క్రైస్తవ శాఖలు అందరూ కలిసి సమైక్యంగా క్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ ఉత్సాహంగా ముందుకు కదిలారు..
