పెదవడ్లపూడి విచారణలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

జోసెఫ్ అవినాష్
04 Apr 2026
గుంటూరు పీఠ పరిధిలోని పెదవడ్లపూడి విచారణలో విచారణ గురువులు ఫాదర్ నల్లపాటి శౌరిబాబు గారి అధ్యక్షతన గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యంగా ఆనాడు కల్వరిగిరిలో క్రీస్తు సకల మానవాళి కొరకు అనుభవించిన శ్రమలను బహిరంగ సిలువ మార్గం ద్వారా చాలా చక్కగా ప్రదర్శించారు.ఈ ప్రదక్షణ ఆధ్యాత్మికంగా అందర్నీ ఆకట్టుకుంది.సుమారు 5 కిలోమీటర్ల మేర జరిగిన ఈ బహిరంగ సిలువ మార్గ యాత్రలో విశ్వాసులు ఎండను కూడా లెక్క చేయకుండా ఈ ప్రదక్షణలో విశ్వాసముతో పాల్గొని క్రీస్తు సిలువ శ్రమలను ధ్యానించారు. ప్రదక్షణ అనంతరం శుభ శుక్రవార సాంగ్యాలను అర్థవంతంగా కొనియాడారు.
