ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శుభ శుక్రవార వేడుకలు

ఫాదర్ చల్ల డేవిడ్ (భారతమిత్రం, ప్రధాన సంపాదకులు)
04 Apr 2026
అన్ని కతోలిక పీఠాలలో మరియు ఇతర క్రైస్తవ సంఘాల నేతృత్వంలో గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తియుతంగా జరిగాయి. సమస్త మానవాళి రక్షణార్థం యేసుక్రీస్తు ఘోరమైన శిలువ మరణాన్ని పొందాడు.సిలువపై బంగారు ఏడు పలుకులను పలికి మానవాళికి రక్షణ భాగ్యాన్ని సాధించిపెట్టాడు.ఈ శుభశుక్రవారాన్ని పురస్కరించుకొని ప్రపంచమంతట ముఖ్యముగా ఆంధ్ర,తెలంగాణ ప్రాంతాలలో ప్రతి పీఠం,ఇతర క్రైస్తవ శాఖల వారు శుభశుక్రవార సాంగ్యాలను అర్థవంతముగా,భక్తివంతముగా నిర్వహించారు.ఆయా విచారణలలో ఏసుప్రభుని శ్రమల ఘట్టాన్ని ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో బహిరంగ ప్రదక్షణ చేశారు.ప్రజలందరూ సత్య సువార్తను చాటారు.ఉదాహరణకు హైదరాబాద్, ఖమ్మం, విజయవాడ, గుంటూరు మరికొన్ని పీఠాల ఫోటోలు మనం చూడవచ్చు.
